Natyam ad

పుంగనూరులో లబ్ధిదారులు ఉన్నచోటుకే వెళ్లి పలకరింపులు-చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మున్సిపాలిటిలో వినూత్నరీతిలో బుధవారం జరిగింది. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా , మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి చెంగలాపురం రోడ్డు, అబుబకర్‌ మసీదువీధి ప్రాంతాలలో నిర్వహించారు. లభ్దిదారులు చింతకాయ కొడుతున్న వారి వద్దకు అలాగే మెకానిక్‌ల వద్దకు , ఇంటి పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేసి, సంక్షేమ పథకాల జాబితా చదివి వినిపించారు. పథకాలు అందిందా లేదా అంటు ప్రశ్నించారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి లబ్దిదారులతో చర్చిస్తామన్నారు. గడప గడపకు కార్యక్రమంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకులు పలుమార్లు ఇండ్ల వద్దకు రావడం సంతోషంగా ఉందంటున్నారని తె లిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు సాజిదాబేగం, అమ్ము, కిజర్‌ఖాన్‌, కమలమ్మ, జయభారతి, నరసింహులు, కాళిదాసు, ఆదిలక్ష్మీ, యువకుమారి , మక్కాకమిటి డైరెక్టర్‌ ఖాదర్‌ , వైఎస్సార్‌సీపీ నాయకులు రాజేష్‌, లక్ష్మణ్‌రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Go to the beneficiaries in Punganur and greet them – Chairman Aleem Basha

Post Midle