Natyam ad

పత్రికలు పంచడానికి వెళ్లి అనంతలోకాలకు

నిర్మల్ ముచ్చట్లు:

మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ కు చెందిన మహమ్మద్ బషీర్ (25), తన మిత్రులు అమీర్ ఖాన్ (26) తౌసిఫ్ (26) లతో కలిసి ద్విచక్రవాహనం ఏపీ 01 ఏసీ 1579పై నిజామాబాద్ జిల్లా దూదిగాం గ్రామంలోని బంధువులకు పెళ్లి పత్రికలు పంచి  అర్థరాత్రి సుమారు 12.35 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలో  44 జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీ కొట్టడంతో బషీర్, అమీర్ ఖాన్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తౌసిఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ బషీర్ కు ఈ నెల 11న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

 

Tags: Go to the infinite worlds to distribute magazines

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.