Natyam ad

ధర్మానికి హనీ జరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు

పౌరాణికులు తిగుల్లా విషుశర్మ అభిభాషణ
లలితామాత ఆలయంలో ఘనంగా కుంకుమార్చన

జగిత్యాల ముచ్చట్లు:

బంధాలనుంచి నివృత్తి చేయడానికే భగవంతుడు అవతరిస్తాడని
జగిత్యాలకు చెందిన ప్రముఖ పౌరణికులు తిగుల్ల విషుశర్మ అన్నారు. ధర్మానికి హాని జరుగుతుంటే భక్తులను ఉద్దరించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతరించాడని అదే కృష్ణాష్టమి రోజని తెలిపారు.ఎప్పుడైతే సాదు, సంతులకు కష్టం ఏర్పడుతుందో, ధర్మం బ్రష్టుపడుతుందో అప్పుడు తాను  సైతం అవతరిస్తానని అమ్మవారు చెప్పారని వివరించారు.
శ్రావణ శుక్రవారం, శ్రీకృష్ణాజన్మాష్టమినీ పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని  లలితామాత ఆలయాప్రాంగణంలో శుక్రవారం  మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. జగిత్యాలకు చెందిన ప్రముఖ పౌరాణికులు తిగుల్లా విషుశర్మ మహిళలచే కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
108 శ్రీచక్ర సహిత లలితామాత ఆలయ ఫౌండరి ట్రస్టీ చైర్మన్ చెల్లం స్వరూపతో పాటు  సామూహిక కుంకుమర్చన కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు, మాతలు, సుహాసినిలు పాల్గొన్నారు.    శ్రావణమాసంలో అమ్మవారికి కుంకుమ పూజలు చేయడంద్వారా అమ్మవారు మహిళల సౌభాగ్యం కాపాడుతుందని  విషుశర్మ అన్నారు.

 

 

Post Midle

ఆలయ ప్రాంగణంలో ప్రతి బుధవారం లలితామాత సహస్ర పారాయణం మహిళలచే నిర్వహిస్తున్నామని ఆలయ పౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప తెలిపారు. అయితే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డినీ ఆలయ కమిటీ పక్షాన సన్మానించారు.
ఆలయంలో వచ్చే శుక్రవారం అమ్మవారికి కధంబా పుష్పాలతో అర్చన కార్యక్రమం ఉంటుందని, భక్తులు, మాతలు హాజరై లలితామాత ఆశీస్సులు పొందాలని ఆధ్యాత్మిక వేత్త పాంపట్టి రవీందర్ కోరారు.కార్యక్రమంలో   మార కైలాసం,మహేశం, చెల్లం సత్తయ్య, వంగల అమర్ నాథ్, నాగేందర్,గట్టు రఘు, భద్రి, నలుమాసు మహేందర్,  పాంపట్టి సులోచన, పెద్ది అశ్విని, అర్చన, లక్ష్మీ,ప్రసన్న, వనజ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

సాయి జీనియస్ హై స్కూల్ నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

కోరుట్ల పట్టణంలోని సాయి జీనియస్ హైస్కూల్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులు చిన్ని కృష్ణులు గోపికల వేషాధారణలో అందరినీ అలరించారు. కురుక్షేత్రాన్ని నడిపించిన శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా జరుపుకునే కృష్ణాష్టమి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీనిలో భాగంగా పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు చిన్ని కృష్ణుని ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ అలరించాయి.. విద్యార్థులు ధర్మబద్ధంగా ఉండాలని ధర్మో రక్షతి రక్షిత అని పాఠశాల కరస్పాండెంట్ చౌకి రమేష్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags: God appears when Dharma is harmed

Post Midle