దేవినేనిది శవరాజకీయాలు

మైలవరం ముచ్చట్లు:

 

మైలవరం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాదు మీడియాతో మాట్లాడారు.  మండలంలోని తోలుకోడు గ్రామంలో మల్లాది నాగేంద్రమ్మ అనుమానాస్పద మృతి కి సంబంధించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతురాలు మల్లా్ది నాగేంద్రమ్మ వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యురాలు ,మా కుటుంబ సభ్యురాలు పట్లల ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం.  మృతురాలు నాగేంద్రమ్మ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. సంఘటన జరిగిన 24గంటల్లోనే ఈ కేసును చేదించిన పోలీసులను అభినందించారు. శవాల మీద పేలాలు ఏరుకునే దేవినేని ఉమా నీ నోటికొచ్చినట్లు  మాట్లాడటం మానుకో సంఘటన జరిగిన 12 గంటలు కూడా గడవక ముందే నీ నీచ రాజకీయం మెదలుపెట్టాగవు. అందుకే జనం వెంటబడి బుద్ది చెప్పారని అన్నారు.

 

 

 

జరిగిన సంఘటన తో ఎక్కుడ నీ పరువు పోతుందోనని తెల్లారేసరికి హడావుడి గా కార్యాలయంలో కూర్చని నీవు రాకుండా తోలుకోడు గ్రా మానికి మీ పార్టీ మహిళల్ని పంపావు. కానీ ఇటువంటి దారుణం ఒక ఎస్సీ మహిళకే కాదు ఎవరికి జరిగినా దురదృష్టకరమే. తోలుకోడు గ్రా మంలో చనిపోయింది దళిత మహిళ. దర్యాప్తు చేస్తున్న ఎస్సై,సీఐ, డీఎస్పీ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే. ఐతే మహిళపై నేరానికి పాల్పడిన ఇద్దరూ కూడా మీ  తెలుగు దేశం పార్టీ కి చెందిన కార్యకర్తలే. దేవినేని ఉమా కు ఈ విషయం తెలియక మరోమారు అలవాటు ప్రళకారం శవ రాజకీయం మెదలుపెట్టాయడు. అమ్మా  గద్దెా అనురాధా గారు..  మీరు డిమాండ్ చేసినట్లు తప్పకుండా మీ కార్యకర్తలకు కఠిన శిక్షలు పడతాయమ్మా. ఐతే మీకు విషయం పూర్తిగా చెప్పాకుండానే మీ మాజీ మంత్రి దేవినేని ఉమా అలవాటు ప్రనకారం శవ రాజకీయాలు మీతో కూడా చేపిస్తు న్నాకరని అన్నారు.
పోలీసులు ఈ కేసును ఎందుకు  కప్పి పెడతారు? తెలుగుదేశం కార్యకర్తలు రేప్ చేస్తే వారిని కాపాడడానికి కప్పి పెడతారా? దేవినేని ఉమా. ఎక్కుడ ఎం జరిగినా హోంమంత్రి, ముఖ్యమంత్రి రావాలంటారు…. మీ హయాంలో వాళ్ళు వచ్చారా? ఫైర్రీ పడవ ప్రమాదంలో మరణించిన వారి కోసం మీతో వాటాలు పెట్టుకున్న మీ వాళ్ళు బాధితులకు ఏం చేశారని ప్రశ్నించారు. దేవినేని ఉమా మీ అత్యుత్సాహం అంతా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైనా మాట్లాడడానికి ముందు కోంచం సంస్కాారం ఉండాలి.

 

 

 

 

నేను కూడా రాజకీయంగా బ్రతికే ఉన్నానని ప్రుజలకు చెప్పుఖకోవడానికి  నిరంతరం ఏదో ఒకటి మాట్లాడతావు తప్పల అసలు నీలో విషయం లేదని తెలుసుకో. రెండు సార్లు ఇక్కడే గెలిచి మంత్రి అయ్యావు. ఈ నియోజకవర్గ ప్రజలకు నీవు ఏంచేశావు? చెప్పుంకో  నిరంతరం మా పై బురద జల్లాలనే ఈ అలివికాని మాటలు ఎందుకు. కరోనా సమయంలో మరణించిన వారికి వైసీపీ కార్యకర్తలు సహకారంతో అంత్యక్రియల నిర్వహించాం. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సీపీఎం, జనసేన చివరికి నీ పార్టీ కార్యకర్త గరికపాటి శివ కి కూడా మాట్లాడే హక్కు ఉంది కానీ నీకు మాత్రం మాట్లాడే హక్కు లేదు. రూ 5 కోట్లు పెట్టి గొల్లపూడి లో ఇల్లు కోనుకున్నావు. నీవు కరోనా సమయం లో నియోజకవర్గం లోని పేదలకు ఏంచేశావు. గతంలో నువ్వు అధికారంలో ఉండి చేయని పనులు ఇప్పుడు నేను చేశాను.తెలుసుకో. సీపీఎం పార్టీ నాయకులు వచ్చిం  అయ్యప్ప నగర్ వద్ద ధర్నా చేస్తే మరుసటి రోజు నువ్వు హడావుడి గా బయలుదేరావు భంగపడ్డాువు. అక్కడ పొడిచా,ఇక్కడ పొడిచా అని చెప్పుకోవడమే గానీ నువ్వు ఎక్కడ చేసిందేమీ లేదని అన్నారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తా వ్రాసి పెట్టుకో అన్న నువ్వు 2019 మే వరకు పదవిలో ఉండి ఏంచేశావు? నీ పార్టీ వాళ్లే తోలుకోడు గ్రా మంలో మహిళపై  అత్యాుచారం చేసి హత్య  చేశారు. ఇప్పుడు చేయ్ దర్నాాలు . ఇప్పుటికైనా శవ రాజకీయాలు మానుకో. ఐనా నీ రాజకీయ జీవితం కూడా శవ రాజకీయం తోనే మెదలుపెట్టా్వుగా ఐనా సరే నీలో మార్పుా వస్తుంలదేమోలే. విలేకరుల సమావేశంలో స్దా నిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: God bless you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *