తిరుమల శ్రీవారికి గోదా మాలలు
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు ఆదివారం ఉదయం అలంకరించారు.తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్ద జియర్‌స్వామివారి మఠానికి ఆదివారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజియర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, గోవిందరాజస్వామి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Goda Malas for Thirumala Srivari