గోదావరిలో కొనసాగుతున్న వరద పోటు
అమరావతి ముచ్చట్లు:
గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరికకుడా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 24.57 లక్షల క్యూసెక్కులు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. 28 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం వుంది. సంబంధిత అధికారుల యంత్రాంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో 9 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుంది. అల్లూరిసీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి లో 4 మండలాలు, ఏలూరులో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం వుంది. అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాలు పంపుతున్నారు. వరద ఉదృతం దృష్ట్యా అదనపు సహాయక బృందాలు రంగంలో వున్నారు. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వున్నాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరద ప్రభావితానికి గురయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
Tags: Godavari continues to flood