గోదావరి వరదలతో బ్రతుకులు చిన్నాభిన్నం”

“వ్యవసాయం , పని లేక పస్తులతో జీవనం”
“సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు ఏది భరోసా”
ముఖ్యమంత్రి పర్యంటపై నిర్వాసితుల గంపెడ ఆశలు


ఏలూరు ముచ్చట్లు:


జగనన్న పోలవరం ప్రాజెక్టు వల్ల మా బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రతి ఏట గోదావరి నదికి వచ్చే వరదలు మా జీవితాలను చిన్న బిన్నం చేస్తూ బతుకుతున్న  జీవత్సల కాలం వెలదీస్తున్నారు. గత ఆరు సంవత్సరాల నుంచి పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి పునరావాస కాలనీలకు తరలిస్తాం అని అధికారులు చెప్తున్నారు తప్ప, ఆచరణలో మాత్రం అమలు చేయటం లేదు. మీరు మా ప్రాంతానికి వస్తున్న సందర్భంగా మా మోర ఆలకిస్తారని, మాకు మీరు ఇచ్చిన హామీలు అమలు పరచాలని వేడుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి , రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సర్వం కోల్పోతున్న  ,త్యాగం  చేస్తున్న మాకు ప్రభుత్వం అండగా ఉండి , మా బతుకుల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన విలీన మండలాలలో  ప్రతి ఏటా గోదావరి వరదలు ఈ ప్రాంత రైతుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. వరదల వల్ల రైతులు వ్యవసాయంలో వచ్చే నష్టాలతో వ్యవసాయం చేయలేక వేరే ఉపాధి వెతుక్కుంటున్నారు. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం , రైతులు వ్యవసాయం చేయకపోవడం వలన వేలాది మందికి పని దొరక్క పస్తులతోనే కాలం వెలదీయాల్సిన పరిస్థితి. ఇలా జీవిస్తున్న కూడా నిర్వాసితులకు న్యాయం జరగటం లేదు. గత ఎన్నికల సమయంలో పోలవరం నిర్వాసితులకు 10 లక్షల వ్యక్తిగత ప్యాకేజీ , ఎకరాకు  5 లక్షలు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఇంతవరకు అమలు కాలేదు. మా ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతం వలన మా కుటుంబంలోని ఆడపిల్లలకు పెళ్లిళ్లు కూడా కానీ పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోతున్న మాకు అన్యాయమే జరుగుతుంది.  న్యాయం జరగటం లేదు. గత ఆరు సంవత్సరాలుగా అధికారులు గ్రామాల్లో పర్యటించి జనవరి , ఫిబ్రవరి , మార్చి , ఏప్రిల్ ,మే , జూన్ , జూలై , ఆగస్టు అంటూ కాలం వెలదీస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో నిర్వహిస్తులకు ప్యాకేజీ ఇచ్చి పునరావాస కాలనీలకు తరలించడం లేదు. అని వాపోతున్నారు.

 

 

 


ఈ నేపద్యం లో నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ చేర్మెన్ డాక్టర్ విజయమోహనరావు  వారి బృందం గోదావరి పరివాహక ముంపు గ్రామాలను పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాముఖ్యమంత్రి దృష్టికి తీసుకేల్లనున్నట్లు  తెలిపారు. సీఎం సారు హామీల అమలు పరచండి… ఎన్నికల ముందు  పోలవరం నిర్వాసితులకు హామీలు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి  సీఎం అయ్యాక కూడా హామీలు గుర్తు ఉన్నాయని చెప్పిన వైనం  నేటికి చాలా మట్టుకు నెరవేర్చినప్పటికి కూడా కొన్ని హామీలు హామీలు లాగానే మిగిలిపోయి ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతిపక్షాల మాట తప్పు అని ఎద్దేవా చేస్తున్నాయి కానీ నిర్వాసితులు మాత్రం సీఎం సార్  మాట ఇచ్చారు అంటే మడమ తిప్పరు అంటున్నారు.పోలవరం నిర్వసితులు…..:-   గోదావరి వరదలు కారణంగా నష్టపోయిన రోజు కుక్కునూరు వేలేరుపాడు మండలాల  పోలవరం నిర్వాసితులు బాధలు చూడటానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది ఈ నేపథ్యంలో . సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు .

 

 

 

అనే ప్రచారంతో నిర్వాసితులలో గతంలో ఇచ్చిన హామీలకు ఆశలు మరల రేకెత్తించాయి. ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఇప్పటి ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితుల కష్టాలు, బాధలు చూసి వారు గోడు విన్నారు.2006 నుండి 2012 లో సేకరించిన భూములకు అతి తక్కువ పరిహారం ఎకరాకు రూ.,1,15,000 (లక్ష పదిహేనువేలరూపాయలు )ఇచ్చారు ఆ పరిహారం కాస్త బ్యాంకుల్లో  జమ అయ్యేసరికి బ్యాంక్ లో ఉన్న రైతుల  పంట ఋణలను బ్యాంకులు మినహాయించికున్నాయని పేర్కొన్నారు. రైతులు చేసేదేమీలేక వట్టి చేతులతో ఇంటికి వచ్చారు. ఈ బాధలన్నీ  అప్పటి పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డికి  వారి గోడు చెప్పుకోగా దానికి జగన్మోహన్ రెడ్డి  స్పందించి నిర్వసితుల చేసిన త్యాగం వెలకట్టలేనిది అని మీకు ఎంత ఇచ్చిన తక్కువే అవుతుందని అధికారంలోకి వచ్చాక  మానవతా దృక్పథంతో  రైతన్నలకు మరల తక్కువ పరిహారం సేకరించిన భూములకు ఎకరాకు 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ఆరు లక్షల నుండి 10 లక్షలుకు పెంచుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆనాడే నిర్వాసితులు జగన్ మోహన్ రెడ్డి గారి హామీని  నమ్మి  తెలంగాణ నుండి విలీనమైన ఏడు మండలాల ప్రజలు పోలవరంలో,

 

 

 

రంపచోడవరం నియోజకవర్గాలలో రాష్ట్రంలోనే భారీ మెజార్టీని విజయాన్ని  వైయస్ జగన్మోహన్ రెడ్డి కానుకగా ఇచ్చారు. ఇంకేముంది సీఎం అయ్యారు. నిర్వాసితుల కళ్ళల్లో ఆనందం మా కష్టాలన్నీ తీరుతాయని నమ్మకం ఏర్పడింది.  కానీ జగన్మోహన్రెడ్డి సీఎం అయి నేటికి మూడు సంవత్సరాలు దాటిన హామీలు హామీ లాగే మిగిలిపోయింది అనివాపోతున్నారు.సంవత్సరం క్రితం సీఎం అయ్యాక కూడా  సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులతో హామీలన్నీ గుర్తు ఉన్నాయని  గతంలో ఇచ్చిన భూములకు ఐదు లక్షలు ఇస్తానని, ఆర్ అండ్ ఆర్ 10 లక్షలు లక్షలకు పెంచుతానని మరోసారి స్పష్టం చేశారు. నిర్వాసితులు మళ్ళీ ఆనందం  ఆనందం కానీ ఇప్పటివరకు హామీల అమలులో లేదు కావున గౌరవ ముఖ్యమంత్రి గారు వేలేరుపాడు పర్యటన భాగముగా అతి సమీపమయినా కుక్కనూర్ మండలమును కూడా పర్యటించి ఇక్కడి ప్రజల కష్టములను సహృదయముతో పరిష్కరించాలని జిల్లా, రాష్ట్ర, నేషనల్ కమిటీస్ ఎకగ్రీవముగా ..పోలవరం ప్రాజెక్ట్ “జాతీయ ప్రాజెక్ట్” కావున కేంద్ర ప్రభుత్వమును ఒప్పించి ముంపు గ్రామాలకు మరియు నిర్వాసితులకు సహాయం అందించాలని విజయమోహనరావు కోరారు.

 

Tags: Godavari floods, lives lost”

Leave A Reply

Your email address will not be published.