గోదావరి నీటి మళ్ళింపు ప్రారంభం

అమరావతి ముచ్చట్లు:
పోలవరం ప్రాజెక్టు వద్ద  స్పిల్ వే మీదుగా గోదావరి నీటి మళ్ళింపు ప్రారంభమయింది.  ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటి విడుదల చేసారు.  మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని , జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు వర్చువల్ గా పాల్గొన్నారు.
గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల
నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు సరఫరా అవుతోంది.  ఈ భారీ వర్షాల  సీజన్ లో వరదను మళ్లించడానికి అనుగుణంగా ఈ ఏర్పాటు చేసారు. అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ద్వారా, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ ద్వారా నీటి మళ్ళింపు చేసారు.  గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేయాడానికి చేసిన  అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి అయింది. 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లింపు జరుపుతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Godavari water diversion begins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *