Natyam ad

రాజకీయాల్లోకి గాడ్ ఫాదర్

విజయవాడ  ముచ్చట్లు:


మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ 10 సెకన్ల ఆడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.   నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం.. నా నుంచి దూరం కాలేదంటూ… చిరంజీవి చెప్పిన ఆడియో ట్విట్.. అ హాట్ టాపిక్  అయిపోయింది. అయితే మెగాస్టార్ చేసిన ఈ ట్విట్‌పై ఓ వైపు మెగా అభిమానులు, మరోవైపు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మనకు రాజకీయాలు వద్దు బాస్ అంటు కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లోని డైలాగ్ అంటూ  కామెంట్స్ పెడుతున్నారు.ఏదీ ఏమైనా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్‌పై భిన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయన్నది మాత్రం నిజం. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు.. తమ పార్టీల విజయం  కోసం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారుఅలాంటి వేళ.. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి కామెంట్స్… అదీ రాజకీయంపై చేయడం పట్ల రాజకీయ పరిశీలకులు సైతం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

 

 

 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి… 2009 ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 18 సీట్లు కైవసం చేసుకొంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టి… కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా జరిగారు. మరో వైపు  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా థియేటర్ల టికెట్ల ధరలను భారీగా తగ్గించింది.  ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో తాడేపల్లిలో చిరంజీవి భేటీ అయ్యారు. దాంతో చిరంజీవికి మళ్లీ రాజ్యసభ టికెట్ అంటూ పెద్ద ప్రచారమే జరిగింది. దీంతో చిరంజీవి.. స్వయంగా   మీడియా ముందుకు వచ్చి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విట్టర్‌లో వదిలిన ఆడియో..  ఆయన తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించినవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చిరంజీవి నిజంగానే రాజకీయాలకు దూరం కాలేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత కేంద్రమంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ చిరంజీవి రాజీనామా చేసినట్లు ఎక్కడా వినలేదు. ఆయన కూడా చెప్పలేదు. కాంగ్రెస్ కూడా చిరంజీవి మా వాడే అని చెప్పుకుంటుంది. కానీ కాంగ్రెస్ కార్యకలాపాలకు మాత్రం ఆయన దూరంగానే ఉంటున్నారు.

 

 

Post Midle

అయితే చిరంజీవి కొంతకాలంగా సినిమాలకే పరిమితమయ్యారు. ఆయన అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. అయినా 2019 ఎన్నికల్లో తమ్ముడి పక్షాన చిరంజీవి నిలబడలేదు. ఎప్పుడూ ఆయన జనసేనకు నేరుగా తన మద్దతును బహిరంగంగా ప్రకటించలేదు. తన అభిమానులకు ఎటువంటి పిలుపు నివ్వలేదు. కానీ మెగా కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కల్యాణ్ కు నేరుగా మద్దతిచ్చారు. మరోవైపు చిరంజీవి అన్ని పార్టీలతో సత్సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. రెండు నెలల క్రితం భీమవరంలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆయనను శాలువాతో సత్కరించారు అలా చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు అందరివాడుగా… ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా పలు దఫాలు చిరంజీవి కలిశారు. సినిమా ఇండ్రస్ట్రీ కోసమే అయినా జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. దీన్ని బట్టి చిరంజీవి అందరివాడుగానే అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. తాజాగా ఆయన ట్వీట్ చేసింది సినిమా వరకే పరిమితం అవుతుందని అంటున్నారు. ఒకసారి చేతులు కాల్చుకున్న చిరంజీవి మరోసారి ఆ ప్రయత్నం చేయకపోవచ్చన్నది ఆయనను బాగా తెలిసిన వారు చెబుతున్న మాట. చిరంజీవి రాజీకీయాలకు పూర్తిగా దూరమయినట్లేనని, మరోసారి ప్రయత్నించే అవకాశం ఉండదని కూడా వారంటున్నారు. అయితే తాజా చిరంజీవి ట్వీట్ మాత్రం రాజకీయంగా చర్చ జరగడానికి ఒక కారణమయిందని మాత్రం చెప్పాలి.

 

Tags: Godfather into politics

Post Midle