బైక్ మీద వెళుతూ సజీవ దహనం

Date:23/02/2021

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెద్దపప్పూరు మండలం వరదాయపాలెంనకు తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. వరదాయపాలెంనకు చెందిన వెంకటలక్ష్మమ్మ, ఆమె కుమారుడు వెంకటస్వామి తోటలో కూలి పనికోసం బైక్‌పై బయల్దేరారు. పోలాల మధ్యలో ఉన్న రోడ్డుపై 33/11కేవీ విద్యుత్‌ వైరు తెగిపడి ఉంది. ప్రమాదవశాత్తూ బైక్ విద్యుత్‌ తీగలకు తగలడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరూ అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంట్ వైర్లు తెగి రోడ్డుపై పడగా.. వెంకటస్వామి గమనించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కూలి పనుల కోసం వెళుతున్న తల్లీ, కొడుకును మృత్యువు కరెంటు రూపంలో కాటేసింది.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Going on the bike and burning alive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *