మళ్లీ తెరపైకి  గోకరాజు అనధికార కట్టడాలు

Gokaraju unauthorized structures again on the screen

Gokaraju unauthorized structures again on the screen

Date:18/09/2018
విజయవాడ ముచ్చట్లు:
రూల్స్….. నిబంధనలు సామాన్యులకే కానీ పెద్దలకు అవేమి వర్తించవని తేలిపోయింది… నదీ  తీర ప్రాంతాలు….. నీటి ప్రవాహాలకు అవాంతరాలు కల్పిస్తే ఎలాంటి విపరీతాలు జరుగుతాయో ఇటీవలి కేరళ వరదలు కళ్లకు కట్టినట్టు చూపాయి. ఉరకలు వేసే ప్రవాహ మార్గాల్లో చేపట్టే నిర్మాణాలు కడితే ఏం జరుగుతుందో అందరికి అర్ధమైంది. ఏపీ రాజధాని అమరావతిలో మాత్రం ఇవే పొరపాట్లు దర్జాగా చేసేస్తున్నారు.
పది హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే చెరువులు., కుంటలు., వాగుల పూర్తి స్థాయి నిల్వ సామర్ధ్యానికి 30 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. పది హెక్టార్ల కంటే తక్కువ ఉన్న శిఖం భూములు., చెరువులు, కుంటల 9 మీటర్లలోపు నిర్మాణాలు చేయకూడదు. 10మీటర్ల కంటే వెడల్పు ఉన్న వరద నీటి కాల్వలు., వాగులు., కెనాల్స్‌., డ్రెయిన్లకు 9 మీటర్లలోపు నిర్మాణాలు చేయకూడదు. ఇన్ని నిబంధనలు ఉన్నా తీరం వెంబడి భారీ నిర్మాణం ఎలా చేశారన్నదే అందరి సందేహం. కృష్ణానది నుంచి గుంటూరు నగరానికి మంచినీటిని సరఫరా చేసే ఓవర్‌ హెడ్‌ ట్యాంకు …… కొండవీటి వాగు కృష్ణానదిలో కలిసే నడుమ రెండెకరాల విస్తీర్ణంలో భారీ నిర్మాణాన్ని చేపట్టారు.
రెండంతస్తుల ఇంటితో పాటు ఆ పక్కనే మరో మూడు చిన్న భవనాలను సిబ్బంది., కార్యాలయాల కోసం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కృష్ణాతీరంలో కరకట్ట దిగువున ఉన్న భూముల్ని సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నించగానే గోకరాజు గంగరాజు తన భూమిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పై ప్రభుత్వంకూడా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత కార్యాలయ నిర్మాణం కాస్త అటకెక్కింది.ఓ వైపు కృష్ణా నది మరోవైపు కొండవీటి వాగు., ఇంకో వైపు సాగు నీటి డ్రెయిన్ మూడు వైపులా నీరుండే ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతానికి వరద ముప్పు ఉండకూడదని భారీ లిఫ్ట్ స్కీం నిర్మాణం చేపట్టారు.
దాదాపు 250కోట్ల రుపాయల ఖర్చుతో ఉండవల్లి గ్రామం వద్ద లిఫ్ట్‌ నిర్మాణం చేపట్టారు. ఓ వైపు బకింగ్ హామ్ కెనాల్., మరో వైపు కృష్ణానది., ఇంకో వైపు కొండవీటి వాగు వీటి మధ్య వరద ప్రవాహాన్ని నదిలోకి ఎత్తిపోసే లిఫ‌్ట్ ను నిర్మించారు. ఎంత పెద్ద వరద వచ్చినా., వాగులు ఉప్పొంగినా ఆ నీరంతా కొండవీటి వాగు బ్యాక్‌ వాటర్‌గా నిలిచి ఉండేలా డిజైన్ చేశారు. ఇలాంటి ప్రాంతంలో ఓ భారీ నిర్మాణం వెలిసింది.ఏపీ రాజధానిగా కృష్ణా తీరం వెంబడి ఉన్న 29 గ్రామాలలో రాజధాని నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రాజకీయ పార్టీలు., సామాజిక సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చినా రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో 33వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం మొదలైంది.
అక్కడక్కడ భూ సమీకరణను వ్యతిరేకిస్తూ రైతులు కోర్టులనాశ్రయించడంతో పనులు కూడా నిలిచిపోయాయి. ఇలాంటి వివాదాలు ఉన్న ప్రాంతాల్లో ఉండవల్లి గ్రామం కూడా ఒకటి. ప్రకాశం బ్యారేజీకి అవతల ఉన్న ఉండవల్లి గ్రామంలో భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాలేదు. కృష్ణా తీరంలో ఉన్న సారవంతమైన భూములు కావడం., విజయవాడకు అతి సమీపంలో ఉండటంతో భూములిచ్చేందుకు ఎవరు ఇష్టపడలేదు. రాజధాని నిర్మాణానికి ఇవ్వని భూములు వ్యవసాయ భూములుగానే మిగిలిపోతాయని సిఆర్‌డిఏ పలు మార్లు హెచ్చరించినా ఇక్కడి రైతులు లెక్క చేయలేదు. ఇలాంటి భూముల్లో ఒకదానిలో వాగుకు అతి సమీపంలో ప్రజా ప్రతినిధి ఒకరు భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
కొండవీటి వాగు లిఫ్ట్‌ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఇంటి పనులు ప్రారంభించి పూర్తి చేసేశారు. అందరు వచ్చి పోయే దారిలోనే దీని నిర్మాణం జరిగినా అదేదో లిఫ్ట్‌ స్కీంకు సంబంధించిన కార్యాలయమో., ఇరిగేషన్‌ భవనమో అని భావించారు.సాధారణంగా నీటి ప్రవాహ మార్గాలకు ఎంత దూరంలో నిర్మాణాలు చేపట్టాలనే విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జివో నెంబర్‌ 168 ద్వారా మార్గ నిర్దేశకాలు జారీ చేశారు. నదీ తీరాలలో జరుగుతున్న విధ్వంసంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
నదీ తీరాల హద్దులను నిర్ధారిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కార్పొరేషన్లు., మునిసిపాలిటీల పరిధిలో ప్రవాహానికి 50 మీటర్ల వెలుపల మాత్రమే ఎలాంటి నిర్మాణమైనా ఉండాలి. ఆ ప్రవాహ పరిధిని మాత్రం రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులే నిర్ణయించాలి. నగర పాలక సంస్థలు., మునిసిపాలిటీల వెలుపల అయితే 100మీటర్లలోపు నిర్మాణాలు చేయకూడదు.కొండవీటి వాగు ప్రవాహ మార్గంలో నిర్మాణాలపై అధికారులు మాత్రం మౌనం పాటిస్తున్నారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ మాత్రం నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తన స్థలంలో ఇల్లు కట్టుకున్నాడని సింపుల్‌గా చెప్పేశారు. ఈ ప్రాంతంలో ఉన్న అందరికి ఇలాంటి మినహాయింపే ఇస్తారా అన్నది అసలు సందేహం. అటు సిఆర్‌డిఏ అధికారులు సైతం దీనిపై నోరు విప్పడం లేదు. ఎంపీకి ఇచ్చిన మినహాయింపు సామాన్యులకు కూడా ఇస్తే ఉండవల్లిలో ఉన్న భూములకు భారీ డిమాండ్‌ కూడా ఏర్పడుతుంది.
Tags:Gokaraju unauthorized structures again on the screen

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *