గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

Date:25/01/2021

తిరుమలముచ్చట్లు:

తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. తిరుమలలోని అద‌న‌పు ఈవో క్యాంపు కార్యాలయమైన ఈ భవనం ప్రాంగణంలో గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పొల్గొంటారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Gokulam Mustabu for Republic Day celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *