Natyam ad

సెప్టెంబ‌రు 7న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబ‌రు 7వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.  గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు.  శ్రీ కృష్ణ‌స్వామి ముఖ మండ‌పంలో మ‌ధ్యాహ్నం 3 నుండి  సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణ స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ  జ‌రుగ‌నుంది. రాత్రి 7 నుండి 8.15 గంట‌ల వ‌ర‌కు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి క‌టాక్షించ‌నున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 9 గంటల‌ వరకు గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

 

 

Post Midle

అదేవిధంగా  సెప్టెంబ‌రు 8న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, త‌రువాత ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారికి ఉట్లోత్స‌వం, ఆస్థానం నిర్వహిస్తారు.   కార‌ణంగా సెప్టెంబ‌రు 8న ఆల‌యంలో స‌హ‌స్ర దీపాలంక‌ర‌ణ సేవ‌ను టీటీడీ ర‌ద్ధు చేసింది.

 

Tags:Gokulashtami at Tiruchanur Srikrishna Swamy Temple on 7th September

Post Midle