19న శ్రీ వేంకటేశ్వర సప్త గో ప్రదక్షణ మందిరంలో గోకులాష్టమి వేడుకలు

తిరుపతి ముచ్చట్లు:

అలిపిరి వద్ద టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్త గో ప్రదక్షణ మందిరంలో ఆగస్టు 19వ తేదీన తొలిసారిగా గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సంధర్బంగా శ్రీ కృష్ణ స్వామి వారికి ఉదయం 8 నుండి 9 గంటల వరకు అభిషేకం, విశేష పూజ నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 10 -30 గంటల వరకు గోపూజ నిర్వహిస్తారు.శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను గోశాలలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్న టీటీడీ, తొలిసారిగా సప్త గో ప్రదక్షణ మందిరంలో కూడా గోకులాష్టమి వేడుకలు నిర్వహించనుంది. ఇందుకోసం గో ప్రదక్షణ మందిరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని దానంగా అందించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల నమ్మకం.ఈ సందర్భంగా ఉదయం 8 గంట‌ల‌ నుండి టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తన గానం, భజనలు, కోలాటాలు, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Tags: Gokulashtami celebrations at Sri Venkateswara Sapta Go Pradakshana Mandir on 19th

Leave A Reply

Your email address will not be published.