ముస్లింల పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలు

–  ప్రకటించిన సౌదీ ఆరేబియా

దుబాయ్‌ ముచ్చట్లు:

ముస్లింల పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ ఆరేబియా ప్రకటించింది. బంగారు, రాగి కొత్త గనులను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన జియోలాజికల్‌ సర్వే తన ట్వీట్‌లో తెలిపింది. మదీనా ప్రాంతంలో ఉన్న అబా అల్‌ రహ వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. వాది అల్ ఫారా ప్రాంతంలో సుమారు నాలుగు చోట్ల రాగి గనులు ఉన్నట్లు భావిస్తున్నారు. బంగారం, రాగి గనుల వల్ల ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని సౌదీ జియోలాజికల్ సర్వే తన రిపోర్ట్‌లో రాసింది. కొత్త మైనింగ్‌ ప్రాంతాల వల్ల సుమారు 533 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించవచ్చు అని, దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.

 

Tags: Gold and copper deposits in the Muslim holy city of Medina

Leave A Reply

Your email address will not be published.