డౌన్ ట్రెండ్ లో బంగారం

Gold in the Down Trend

Gold in the Down Trend

Date:12/11/2019

ముంబై ముచ్చట్లు:

పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.300 పడిపోయింది. ఈ రోజు మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,550కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,250కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పైకి నడిచింది. రూ.50 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,700కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గింది. దీంతో ధర రూ.38,200కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.37,000కు దిగొచ్చింది.బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం.

 

విజయ దేవరకొండతో మాళవిక

 

Tags:Gold in the Down Trend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *