మళ్లీ పడిపోయిన బంగారం ధరలు

Date:07/11/2019

ముంబై ముచ్చట్లు:

పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.400 తగ్గింది. దీంతో ధర రూ.39,900కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.360 తగ్గింది. దీంతో ధర రూ.36,580కు క్షీణించింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. రూ.200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు దిగొచ్చిందిఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గింది. దీంతో ధర రూ.38,550కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గుదలతో రూ.37,350కు పడిపోయింది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.200 తగ్గింది. దీంతో ధర రూ.48,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.10 శాతం తగ్గుదలతో 1,491.55 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.03 శాతం క్షీణతతో 17.59 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

 

తండ్రి పాత్రలో కనిపించనున్న యంగ్ రెబెల్ స్టార్

 

Tags:Gold prices fell again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *