అమరావతి ముచ్చట్లు:
ఈ మధ్యకాలంలో బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,200కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.67,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,350 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం ధర రూ.53,800గా ఉంది.
Tags: Gold prices rose again