ఆపత్కాలంలో ఆదుకొనే బంగారం

హైదరాబాద్ ముచ్చట్లు:

 

కరోనా కష్టకాలంలో ఇల్లు గడవక జనం బంగారం కుదువ పెడుతున్నారు. పైసా పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న బంగారమే ఆపతిలో అక్కరకు వస్తున్నది. కొందరైతే పుస్తెల తాడును కూడా తాకట్టు పెడుతున్నారు. కాలం మంచిగుంటే తిరిగి విడిపించుకోవచ్చన్న  నమ్మకంతో ఇప్పుడు కష్టాలు గట్టెక్కే దారిని లెంకుకుంటున్నారు. ఒకప్పుడు అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చి, ఆఫర్లు అనౌన్స్ చేసినా  బంగారం తాకట్టు పెట్టడానికి ముందుకు రాని జనం ప్రస్తుతం పాన్ బ్రోకర్ల  ముందు క్యూ కడుతున్నారు. మణప్పురం, ముత్తూట్ ఫిన్ కార్ప్, ముత్తూట్ మినీ, ఐఐఎఫ్ఎల్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల బ్రాంచ్లు కస్టమర్లతో ఫుల్ బిజీగా కనిపిస్తున్నాయి. అనేక బ్రాంచుల్లో కస్టమర్లు గతంలోకన్నా డబుల్ అయ్యారు.కరోనా, లాక్డౌన్ కారణంగా చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. చిన్న చిన్న కంపెనీలు, సంస్థల్లో చిరుద్యోగాలు చేసుకునే చాలా మందికి ప్రస్తుతం కొలువులు లేకుండా పోయాయి.  హోటళ్లు, రెస్టారెంట్లలో పని చేసుకునెటోళ్లకు కూడా  ఉపాధి కరువైంది. చాయ్ దుకాణాలు, మిర్చి బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద ఆధారపడే వారి జీవితాలూ ఆగమయ్యాయి.  ఏ రోజుకారోజు అప్పు  చేసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసెటోళ్లంతా వ్యాపారం సాగక  తిప్పలుపడుతున్నారు. కొందరికి వ్యాపారమే లేక, మరికొందరికి ఉన్నా నడవక భార్యా బిడ్డలకు తిండి పెట్టలేని పరిస్థితికి వచ్చారు.

 

 

 

 

బయట అప్పు కింద పైసలు పుట్టక కొందరు, అడగడానికి నోరు రాక ఇంకొందరు ఇంట్లోనో, ఒంటి మీదనో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఇల్లు ఎల్లదీస్తున్నారు. హైదరాబాద్లో దాదాపు పేద, మధ్యతరగతి ప్రజలు కిరాయి ఇండ్లల్లోనే ఉంటారు. రెంట్ వేలల్లో ఉంటుంది. తిన్నా తినకపోయినా ఠంచన్గా రెంట్ కట్టాల్సిందే. తిండీతిప్పలకు మరికొంత ఖర్చవుతుంది. ఎంత లేదన్నా నెలకు ఏడెనిమిది వేల నుంచి 15 వేలన్నా ఆదాయం లేకపోతే ఇట్లాంటి కుటుంబాలకు కాలం గడవడం కష్టమవుతుంది. కరోనా కష్టకాలంలో చాలా మందికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ గోల్డ్ కంపెనీలు, లోకల్ పాన్ బ్రోకర్లు దిక్కవుతున్నారు. ఇంట్లోనో, ఒంటిమీదనో ఉన్న కొద్దిపాటి బంగారాన్ని కుదువపెడ్తున్నారు. కరోనాకు ముందు ఒక్కో బ్రాంచ్కు  30 మంది కస్టమర్లు వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 70కి చేరిందని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ ఒకరు చెప్పారు. గతంలో గోల్డ్ లోన్లు తీసుకునే వాళ్లు, తాకట్టు పెట్టిన బంగారం తీసుకునేవాళ్లు సమ సంఖ్యలో వచ్చేవాళ్లని, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం కొత్తగా లోన్లు తీసుకునే వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునే వాళ్లు బాగా తగ్గారు’’ అని వివరించారు. లోన్లు తీర్చలేక బంగారాన్ని వదులుకుంటున్నోళ్లు ఎక్కువవుతున్నారని చెప్పారు.  తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి తీసుకొని వెళ్లే వాళ్లు 40–60 శాతం మందే ఉన్నారని అన్నారు.

 

 

 

పోయినేడాది లాక్డౌన్ తర్వాత బంగారాన్ని విడిపించుకుంటున్న వాళ్లకన్నా లోన్లు తీసుకునే వాళ్లే ఎక్కువయ్యారు. గోల్డ్ లోన్ టైమ్ అయిపోయినా కిస్తీలు కట్టడం లేదు. దాంతో మేం నగలను అమ్మేయాల్సి వస్తోంది’’ అని హైదరాబాద్ తార్నాకలోని మణప్పురం గోల్డ్ కంపెనీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఏడాది కాలంలో హైదరాబాద్లో గోల్డ్ లోన్ ఆఫర్ చేసే ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు 250 కిలోల బంగారాన్ని  వేలం వేసినట్లు ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. కొన్ని కంపెనీలు మూడు నెలల వరకు కస్టమర్లు కిస్తీ కట్టకపోతే వారికి నోటీసులు ఇచ్చి బంగారం వేలం వేస్తే.. మరికొన్ని కంపెనీలు మరో ఒకట్రెండు నెలలు అదనంగా ఓపిక పడుతున్నాయి. సమయం ముగిసిన తర్వాత మాత్రం వేలం వేసి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నాయి. చాలా మంది తీసుకున్న లోన్ కన్నా వడ్డీలే పెరిగిపోవడంతో సెటిల్మెంట్లకు కూడా వెళ్లడం లేదు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న బంగారాన్ని పేద, మధ్య తరగతి జనం చూస్తూ చూస్తూ వదులుకోవాల్సి వస్తోంది. లోన్ టర్మ్ పూర్తయినా తిరిగి చెల్లించలేని వారు ఏడాది కాలంలో లక్ష మంది వరకు ఉంటారని అంచనా.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Gold to support in times of disaster

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *