నాలుగు కోట్లు విలువైన గోల్డ్ మిస్సింగ్

-.మా బంగారం సంగతేంటి..?

-ఎస్బీఐ బ్రాంచ్ లో గోల్డ్ గోల్ మాల్..!

-ఆగ్రహించిన కస్టమర్లు చివరికి?

 

శ్రీకాకుళం ముచ్చట్లు:

 

77

శ్రీకాకుళం జిల్లా గార SBI బ్రాంచ్ ఎపిసోడ్ ఇప్పుడు జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది. లోన్ చెల్లించినా బంగారాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో సిబ్బందిని ఖాతాదారులు నిర్భందించారూ.బ్యాంక్‌కి తాళాలు వేసి.. నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.ఈ బ్యాంక్‌లో వందలాది మంది కస్టమర్లు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నారు. కానీ ఉన్నట్టుండి 7 కేజీల బంగారం మాయమైంది. ఓ ఖాతాదారులు లోన్ కట్టేసి బంగారం ఇవ్వమనడంతో అధికారులు.. తెల్లమొహం వేశారు.దీంతో ఆభరణాలు లేవనే విషయం బయటకు వచ్చింది.ఆభరణాలు ఎంతకూ ఇవ్వకపోవడంతో బ్యాంకు సిబ్బందితో వాదనకు దిగారు. దీంతో మూడు నాలుగు రోజుల్లో ఆభరణాలిస్తామని చెప్పి అప్పటికి పంపేశారు. విషయం బయటకు పొక్కడంతో.. ఆ బ్యాంకులో బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్న వారందరూ ఐదు రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన స్టేట్‌బ్యాంక్‌ ఉన్నతాధికారులు గార బ్రాంచ్‌లో ఆడిట్‌ ప్రారంభించారు. డిసెంబరు 8న ఖాతాదారులందరికీ ఆభరణాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలోనే డిప్యూటీ మేనేజర్‌ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో.. రీజనల్‌ మేనేజర్‌ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రూ. 4కోట్ల విలువైన గోల్డ్ మిస్సింగ్ కేసులో డిప్యూటీ మేనేజర్‌ స్వప్నప్రియతో పాటు ఆరుగురు బ్యాంక్ సిబ్బంది పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. గోల్డ్ లోన్ తీసుకున్న 60మంది కస్టమర్లు బ్యాంక్ దగ్గరకు చేరుకుని షట్టర్ క్లోజ్ చేసి తాళాలు వేశారు. తమ బంగారం ఇచ్చిన తర్వాతే బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

 

Tags: Gold worth four crores is missing

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *