Natyam ad

పుంగనూరులో తాళాలు పగులగొట్టి రూ.15 లక్షల విలువ చేసే బంగారు చోరీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రహమత్‌ నగర్‌లో ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిలోని 150 గ్రాముల బంగారు, నగదు రూ. 45 వేలు చోరీ చేసుకెళ్లిన సంఘటన శనివారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది.పోలీసుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. పట్టణంలోని మస్తాని అనే గృహిణి తమ బంధువుల వివాహం కోసం గత నాలుగురోజుల క్రితం బెంగళూరుకు వెళ్లింది. తిరిగి బెంగళూరు నుంచి శనివారం పుంగనూరుకు చేరుకుని ఇంటికి వెళ్లి చూడగా ఇంటి తలుపుతాళం పగులగొట్టి, ఇంటిలోనికి వెళ్లి బీరువాలు పెరికివేశారు. బీరువాలో దాచిన 150 గ్రాముల వివిధ రకాల బంగారు అభరణాలను రూ. 45 వేలు నగదును దొంగతనం చేసుకుని వెళ్లారు. ఈ సంఘటనతో నిశ్చేష్టురాలైన మస్తాని లబోదిబో మంటు పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ చిత్తూరు నుంచి క్లూస్‌టీమును పిలిపించి దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా దొంగతనం ఎప్పుడు జరిగిందన్న విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. ఐదు రోజులుగా ఇల్లు తాళం వేసి ఉండటం, చుట్టు ప్రక్కల వారు గమనించకపోవడంతో విషయం తెలియరాలేదు.

 

 

Post Midle

Tags; Gold worth Rs 15 lakh stolen by breaking locks in Punganur

Post Midle