నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
హైదరాబాద్ ముచ్చట్లు :
టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కింది ట్రిపుల్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను ప్రతిష్టాత్మకగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్..అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. ఈ ఇద్దరి నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌తో అదరగొట్టారు ఈ ఇద్దరు హీరోలు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ మూవీ. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కింది ట్రిపుల్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను ప్రతిష్టాత్మకగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్..అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. ఈ ఇద్దరి నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌తో అదరగొట్టారు ఈ ఇద్దరు హీరోలు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ మూవీ.ఇక ఆర్ఆర్ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది మన సినిమా. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో..నాటు నాటు సాంగ్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు..బెస్ట్ సాంగ్ అవార్డ్ దక్కించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి..అతిరథ మహారథుల మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ పాటలో రామచరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.

అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో అవార్డు అందుకోలేక పోయింది ఆర్ఆర్ఆర్ సినిమా.ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్..ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. రెండు కేటగిరీల్లో అవార్డ్ కోసం పోటీ పడింది. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో విన్ అయ్యింది. కాగా బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో మొత్తం 5 సినిమాలు నామినేట్ అయ్యాయి. వీటిల్లో RRRపైనే అందరి దృష్టీ ఉంది. కానీ ఆర్ఆర్సర్వ్ అవార్డు అందుకోల్కా పోయింది. 2022 మార్చి 24న రిలీజైన ఈ మూవీ..వరల్డ్ వైడ్‌గా 1200కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది. దేశభక్తి కథతో వచ్చిన ఆర్ఆర్ఆర్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం విడుదలైన ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టింది.గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అంటే అది ఆస్కార్‌కు ఎంట్రీ లాంటిది అంటుంటారు.. ఇవాళ ఇక్కడ దర్శకధీరుడు రాజమౌళి సినిమాకి దక్కిన పురస్కారంతో ఆస్కార్ అంచనాలూ పెరిగిపోయాయి చేస్తున్నారు. ఈ టైమ్‌లో ఇవాళ్టి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో సత్తా చాటడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Tags; Golden Globe Award for Natu Natu Song
