జై శంకర్ సార్ స్ఫూర్తితోనే బంగారు తెలంగాణ

–  తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి గృహంలో ఈరోజు తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులచే ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమకాలు పేరుతో తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఐడియాలజీ అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్  దేశంలో ఎక్కడా లేని విప్లవాత్మకమైన మార్పులతో బంగారు తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని దేశంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు జరుగుతున్నట్టుగా మరి ఏ రాష్ట్రంలో లేవని అన్నారు.

 

 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలు ఆయన చేసిన కార్యక్రమాల్ని గుర్తు తెచ్చుకొని ఆయన ఆశయంలో ముందుకు వెళదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం మరియు వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్, కోశాధికారి రాగిపణి రవీంద్ర చారి (ఎయిర్ ఫోర్స్), తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి చొలేటి కృష్ణమాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పులిగిల్ల శ్రీనివాస్, దేవరకొండ వీరాచారి, నారోజు జగజీవన్, ఎం సుదర్శన చారి, పి బ్రహ్మచారి, రవి కిరణ్ మరియు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

 

Tags: Golden Telangana with the spirit of Jai Shankar sir

Leave A Reply

Your email address will not be published.