అన్ని ఆలయాలకు గోమయ దీపాలు
నిర్మల్ ముచ్చట్లు:
వచ్చేనెల 7వ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణలోని అన్ని ఆలయాలకు కోటి గోమయ దీపాలను నిర్మల్ నుండి పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకం అని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని మున్సిపల్ ఫంక్షన్ హాలులో ఈ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చే గోమయ దీపాలను ప్రతి ఒక్కరూ వెలిగించాలని కోరారు. గాయత్రి గోశాల ఆధ్వర్యంలో దాదాపు 40 లక్షల దీపాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయనవివరించారు. గోమయ దీపాలను తయారుచేస్తున్న గోశాల నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ ను అభినందించారు.
Tags: Gomaya lamps for all temples

