నాదెండ్ల కాంగ్రెస్ కు గుడ్ బై

Good bye to the Noodends Congress

Good bye to the Noodends Congress

Date:11/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
కాంగ్రెస్‌కు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గుడ్ బై చెప్పారు. గురువారం పార్టీకి మనోహర్ రాజీనామా చేశారు. త్వరలో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోహర్ గురువారం సాయంత్రం తిరుపతికి బయల్దేరి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తిరుపతిలో జనసేన అధినేత పవన్‌తో సమావేశంకాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేనలో చేరికపై శుక్రవారం అధికారికంగా ప్రకటనచేయబోతున్నట్లు సమాచారం. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడైన మనోహర్.. రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. 2011లో స్పీకర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా ఎన్నికకాకముందు ఆయన డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో పనిచేశారు కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మనోహర్.. టీడీపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. కాని ఆ వార్తల్ని మనోహర్ ఖండించారు. కొద్దిరోజులుగా అనుచరులతో సమావేశమవుతున్న ఆయన.. కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ బలోపేతం అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్న సమయంలో మనోహర్ పార్టీని వీడటం కాంగ్రెస్‌‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది.
Tags:Good bye to the Noodends Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *