పుంగనూరుకు- మంచి రోజులు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ల కృషి

– జర్మన్‌ కంపెనీ బృందం పరిశీలన
– ఎదురుచూసిన జనం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

నిన్నటిదాకా కరువుకు కేరాఫ్‌ …దశాబ్దాలుగా పాలించిన పాలకులకు పుంగనూరు అభివృద్ధి పట్టలేదు. అప్పట్లో ఇదో మారుమూల ప్రాంతం కర్నాటక సరిహద్దులో ఎవరికి పట్టని పుంగనూరుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకోబోతోంది. వేల కోట్ల రూపాయలు గంపత్తుగా తరలివస్తున్నాయి. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన పరిశ్రమలు ఇప్పుడు పుంగనూరులో పెట్టేందుకు దిగుతున్నాయి. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గం పారిశ్రామికాభివృద్ధి బాటపట్టింది. పుంగనూరు ఉపాధి కల్పన కేంద్రంగా మారడంతో మంచి రోజులు వచ్చాయంటు జనం సంబరాలు చేసుకుంటున్నారు

పుంగనూరులోఏర్పాటు అదృష్టం…

పెప్పర్‌ మోషన్‌ ఎలక్ట్రికల్‌ బస్సుల స్థల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్‌ షన్మోహన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆఆండ్రియస్‌ హేగర్‌ , సీటీవో డాక్టర్‌ మదియాస్‌ కెర్లర్‌, సీఎస్‌వో సత్య, ఫైనాన్స్ డైరెక్టర్‌ ఉవేస్టెల్డర్‌, నాఉర్థ్ఎలక్ట్రిక్‌ ఎండి హర్ష ఆధ్యా, పెప్పర్‌ సీఈవో రాజశేఖర్‌రెడ్డి, సీఎస్‌వో సత్యబులుసు, సీసీవో రవిశంకర్‌తో కలసి ఆరడిగుంట, వనమలదిన్నె, మేలుందొడ్డి గ్రామాల్లో కేటాయించనున్న 800 ఎకరాల భూమిని కంపెనీ ప్రతినిధులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మంచినీరు, విద్యుత్‌, పుష్కలంగా లభిస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు. కర్నాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పుంగనూరు వ్యాపార లావాదేవిలకు అనువైన ప్రాంతం అని అభివర్ణించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల కోరిక మేరకు కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 10 వేల మందికి నేరుగా , పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఫిబ్రవరి లోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో ప్రజలు ఎంతోఆసక్తిగా వచ్చి కంపెనీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మనోజ్‌రెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌లు కలసి సీఈవో , కలెక్టర్‌, కంపెనీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికి, శ్యాలువలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పార్టీమండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యదర్శులు చంద్రారెడ్డి యాదవ్‌, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు.

సువర్ణ అక్షరాలతో లిఖించాలి…

పడమటి నియోజకవర్గమైన పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్దిగాంచిన జర్మన్‌ పెప్పర్‌ ఎల్‌క్ట్రికల్‌ బస్సుల కంపెనీ ఏర్పాటు కావడం జిల్లా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ కొనియాడారు. కంపెనీ ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల చొరవతో పరిశ్రమ ఏర్పాటౌతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండ ఇక్కడే సుమారు 8000 వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు , ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించి , కంపెనీ త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.

 

Tags: Good days for Punganur – Minister Peddireddy and MP Midhun’s efforts

Post Midle