Natyam ad

పనస కాయలకు మంచి డిమాండ్

శ్రీకాకుళం ముచ్చట్లు:


ఉద్దానం పంటను ఉత్తరాది వాళ్లూ మెచ్చారు. ఇక్కడి పనసకు కాయలను ఆ రాష్ట్రాల వారు లొట్టలేసుకుని తింటున్నారు. దీంతో ఇక్కడి పనస డిమాండ్‌ పెరుగుతోంది. రుచి పరంగా అద్భుతంగా ఉండడంతో పాటు రంజాన్‌ సీజన్‌ కావడంతో ఉత్తరప్రదేశ్, బిహార్, తదితర రాష్ట్రాలు ఉద్దానం ప్రాంతం నుంచి పనస కాయలు, పండ్లను దిగమతి చేసుకుంటున్నాయి.మరోవైపు కాశీబుగ్గ కేంద్రంగా బరంపురం, గుజరాత్, కోల్‌కతా, కటక్‌ తదితర ప్రాంతాలకు కూడా పనస ఎగుమతి అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ, పూండి, హరిపురం, కవిటి, ఇచ్ఛాపురం, మందస, కంచిలి, సోంపేట కేంద్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు పనస ఎగుమతులు ఊపందుకున్నాయి. గడచిన రెండు నెలల్లో రోజుకు సగటున 44 టన్నుల చొప్పున ఇప్పటివరకు 2,640 టన్నుల పనస కాయలు ఎగుమతి అయ్యాయి.మార్చి నెలాఖరు నుంచి మే వరకు పనస ఎగుమతులు కొనసాగుతాయి. తిత్లీ తుపానుకు దెబ్బతిన్న పనస చెట్లన్నీ ఈ ఏడాది జీవం పోసుకుని విరగకాస్తున్నాయి.

 

 

ఉద్దాన ప్రాంతంలోని ఏడు మండలాల్లో పనస అంతర పంటగా సాగవుతోంది. ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు రావడంతో ప్రస్తుతం కేజీ పనస కాయ కేవలం రూ.13 చొప్పున మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర గతంలో కేజీ రూ.20 వరకు ఉండేది. ఉద్యాన శాఖాధికారులు పనస, మునగ తదితర పంటలకూ ప్రభుత్వ పరంగా ధరలు నిర్ణయిస్తే మేలు జరుగుతుందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.ముక్కల బిర్యానీ, పనస పొట్టు కూర, పనస పండు హల్వా, పనస పొట్టు పకోడి, పనస గింజల కూర, పనస ముక్కల గూనచారు, పనస చిల్లీ, పనస కాయ కుర్మా, పనసకాయ ఇడ్లీ, పొంగనాలు, పనస నిల్వ పచ్చడి, పనస బూరెలు.

 

Post Midle

Tags: Good demand for palm nuts

Post Midle