పార్టీ మారిన టీటీడీపీ నేతలకు అదృష్టం వరించేనా…

Date:12/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
అదృష్టవంతుడ్ని ఎవరూ చెరపలేరు..దురదృష్టవంతుల్ని ఎవరూ బాగుచేయలేరు. రాజకీయాల్లో కలసి వచ్చిన అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుని దురదృష్టాన్ని వెతుక్కునే కొంత మంది నాయకులకు అనుభవపూర్వకంగా తెలిసిరాపోతోంది. రాజకీయ ఎదుగుదల ఇచ్చిన పార్టీని, అవకాశం వాదంతో పదవుల ఆశతో, ఆర్థిక లబ్ది వంటి కారణాలతో పార్టీని ఫిరాయించిన ప్రబుద్ధులు ఓటర్లు గుణపాఠం చెప్పబోతున్నారు. ఎవరెవరైతే ఆ విధంగా పార్టీలు మారి దురదృష్టాన్ని కొని తెచ్చుకోబోతున్నారో..అటువంటి నాయకులు పార్టీ మారకుండా ఉంటే ప్రస్తుతం వారి పరిస్థితి ఎంతో వైభంగా ఉండేది. కానీ, దురదృష్టవరించింది.
నేడు మాపో అది కార్యరూపం దాల్చబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే 2014 ఎన్నికల్లో టిడిపి ద్వారా ఎమ్మెల్యేలుగా విజయంసాధించిన దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సెటిలర్స్‌ అధికంగా ఉన్నచోట్ల విజయం సాధించిన వారు..ఇటీవల చంద్రబాబుపై విమర్శలు చేసిన మాజీ మంత్రి నర్సింహులు పార్టీ మారకుండా టిడిపిలో ఉండి ఉంటే అదృష్టం వారిని వెతుక్కుంటూ వచ్చేది. కానీ పార్టీ మారి దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నారు వారందరూ. 2014 ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించగా 21 నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానాల్లో ఉన్నారు.
ఇటీవల కాంగ్రెస్‌, టిడిపినేతలు సమావేశమై నియోజకవర్గాలుగా అప్పటి పోలైన ఓట్లను ఇప్పటి పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం సక్రమంగా అమలు అయితే ఫిరాయింపుదారులో ఒకరిద్దరు తప్ప మిగతా వారెవరూ గెలవరు. అదే విధంగా నర్సింహ్లులు పరిస్థితి ఉంది. ఆఖరి నిమిషంలో సరైన నిర్ణయం తీసుకున్న మళ్లీ అదృష్టం కలసి రావచ్చు. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి కాగలుగుతారో..లేదో కానీ..అదే టిడిపిలో ఉంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉండేవారు. అధికార యంత్రాంగం ఆయన చుట్టూ ప్రదిక్షణలు చేసేది.
కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆయన  ఉనికిని కోల్పోయారు. అదే విధంగా మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి టిడిపిలో చేరాలని భావించినా మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఒత్తిడితో కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడు ఆయన టిడిపిలో చేరినట్లయితే ఆయనకు గత వైభవం కలిసి వచ్చేది. మళ్లీ అధికారాన్ని చెలాయించేవారు. రాజకీయ పరిణామాలు ఈ విధంగా మారతాయని, మారవచ్చునని రేవంత్‌రెడ్డి, నాగం, తలసాని, నర్సింహులు తెలుసుకోలేకపోయారు. ఎట్టి పరిస్థితుల్లో టిడిపి 25 స్థానాలు పోటీ చేయవచ్చు. స్థానిక నాయకులు 15సీట్లు అని ప్రచారం చేస్తున్నా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండడంతో, 25స్థానాల్లో టిడిపి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఫిరాయింపు టిడిపి ఎమ్మెల్యేలు తమకు అపజయం తప్పదేమో అన్న ఆందోళనతో కనిపిస్తున్నారు. అందుకే అంటారు.అదృష్టవంతుడ్ని చెరపలేరు. దురదృష్టవంతుడిని కాపాడలేరు. కాంగ్రెస్‌,టిడిపి పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వస్తే..గతంలో మంత్రులు అవుతారని కలలో కూడా ఊహించని వారు మంత్రులయ్యే అవకాశం ఉంది. గ్యారెంటీగా మంత్రులు అవుతామని భావించిన వారందరూ పార్టీ ఫిరాయించి రాజకీయ ఎదుగుదలను చేజేతులార పాడుచేసుకున్నారు. టిడిపి, కాంగ్రెస్‌, సిపిఐ పొత్తు ఖాయమని, కోదండరామ్‌ కలసి వచ్చినా..రాకపోయినా..ఆ మూడు పార్టీలు పొత్తుతో పోటీ చేయబోతున్నాయి. ఏది ఏమైనా చివరకు టిడిపి ద్వారా ఆర్థిక, రాజకీయ లబ్ది పొందిన నాయకులందరికి ఎన్నికల్లో ఓటర్లు బుద్ది చెప్పబోతున్నారు.
గతంలో టిడిపి అభ్యర్థులందరికీ ఓటు వేసి గెలిపించాం. వారంతాటిఆర్‌ఎస్‌లో చేరారు..ఈసారి కూడా అలా చేయకుండా ఉండాలంటే ఓటు వేయకుండా ఉండాలని కొందరు భావిస్తుండగా..వారిని బుజ్జగించి కాంగ్రెస్‌,టిడిపి ప్రభుత్వం వస్తుంది. ఎవరూ ఫిరాయించలేరని నమ్మించగలిగితే వారిని పోలింగ్‌ బూత్‌లకు పంపగలిగితే  వారి ప్రభావం పనిచేసే నియోజకవర్గాల్లో టిడిపి,కాంగ్రెస్‌ అభ్యర్థులు మాత్రమే విజయం సాధించగలరు.
Tags:Good luck to party-turned TDP leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *