దివ్యాంగులకు సేవలు అందించడం అదృష్టం

Good luck to serve the offices

Good luck to serve the offices

Date:31/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని భవిత సెంటర్‌లో దివ్యాంగులకు సేవలు అందించడం ఎంతో అదృష్టంగా భావించామని భవిత సెంటర్‌ ఫిజియోథెరపిస్ట్ దేవి అన్నారు. సోమవారం ఆమెను ఎంఈవో లీలారాణి ఆధ్వర్యంలో సిబ్బంది సన్మానించి, ఆమె సేవలను కొనియాడారు. ఆమె బదిలీ కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ప్రతి సోమవారం భవితలో దివ్యాంగులైన విద్యార్థులకు ఫిజియోథెరపి చేపట్టి, వారికి అనేక విధాలైన మెలకవలు, సూచనలు అలవాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులకు పెద్దూరుకు చెందిన హేమంత్‌కుమార్‌, పావని దంపతులు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సాయిప్రసన్న, అఖిల, సీఆర్‌పిలు లతీఫ్‌, రమణ, నారాయణస్వామి, మీనాక్షి, శ్రీనివాసులు, శేఖర్‌, చిత్ర తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే, ఎంపి నూతనసంవత్సర శుభాకాంక్షలు

Tags;Good luck to serve the offices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *