టాలీవుడ్ లో మంచి అవకాశాలే

Date:02/03/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూట్యూబ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న పూజిత పొన్నాడ టాలీవుడ్ లో మంచి అవకాశాలే దక్కించుకుంది. గతేడాది ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ సినిమాలో కూడా పూజిత నటించింది. ఇప్పుడు రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘where is the వెంకటలక్ష్మీ’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో పూజిత హీరోయిన్ అనే చెప్పాలి. ఈమె పాత్రకి లవ్ స్టోరీ పెట్టి ప్రధానంగా నడిచేలా చూసుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో పూజిత ఓ రేంజ్ లో హీరోతో రొమాన్స్ చేసింది. పూజితకి జంటగా బుల్లితెర నటుడు రామ్ కార్తిక్ నటించారు.వీరిద్దరి మధ్య ఘాడమైన లిప్ లాక్ సన్నివేశాలను చిత్రీకరించారు. వాటిని ట్రైలర్ లో చూపించడంతో మంచి వ్యూస్ దక్కించుకుంది. అయితే పూజిత భర్త మాత్రం తన భార్య వ్యవహారంతో అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. పూజిత పొన్నాడకి ఇదివరకే పెళ్లైంది. అయితే ఆ విషయంలో ఇండస్ట్రీలో ఎవరికీ పెద్దగా తెలియదు.అవకాశాల కోసం ఆమె కూడా కాస్త సీక్రెసీ మైంటైన్ చేస్తోంది. పెళ్లైన స్టార్ హీరోయిన్లు సైతం రొమాన్స్ ని పక్కన పెట్టేస్తుంటే పూజిత మాత్రం డిఫరెంట్ వేలో నడుస్తోంది. స్క్రీన్ పై ఆమె లిప్ లాక్ సీన్ చూసిన భర్త ఈ విషయంలో చాలా అప్సెట్ అయినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామనే కదా..!
Tags: Good moments in Tollywood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *