Natyam ad

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

38 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
డిసెంబర్, జనవరి నెలల్లో తిరగనున్న స్పెషల్ ట్రైన్స్

శబరిమల ముచ్చట్లు:

Post Midle

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తాజాగా ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు వెల్లడించింది. ట్రైన్లు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయి..? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయి? అనే వివరాలను ప్రకటించింది.హైదరాబాద్-కొల్లాం(ట్రైన్.నెంబర్ 07133) డిసెంబర్ 5,12,19,26వ తేదీలలో అందుబాటులో ఉండనుంది. అలాగే జనవరిలో 2,9,16వ తేదీలలో తిరగనుంది. ఇక కొల్లాం-హైదరాబాద్(ట్రైన్. నెంబర్ 07134) డిసెంబర్ 6,13,20,27వ తేదీలతో పాటు జనవరి 3,10,17వ తేదీలలో నడవనుంది. ఈ సర్వీసులు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌తో పాటు మరికొన్ని ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి.నర్సాపురం-కొట్టాయం మధ్య (ట్రైన్ నెంబర్ 07119) డిసెంబర్ 2,9,16,30, జనవరి 6,13వ తేదీలలో తిరగనుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొట్టాయం-నర్సాపురం మధ్య(ట్రైన్.నెంబర్ 07120) డిసెంబర్ 3,10,17,31వ తేదీలతో పాటు జనవరి 7,14వ తేదీలలో నడవనుంది. ఈ ట్రైన్ పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరుతో పాటు ప్రాధాన స్టేషన్ల అన్నింటిల్లోనూ ఆగనుంది.

 

 

సికింద్రాబాద్-కొట్టాయం(ట్రైన్.నెంబర్ 07125) డిసెంబర్ 4,11,18,25వ తేదీలతో పాటు జనవరి 1,8న తిరగనుంది. అలాగే కొట్టాయం-సికింద్రాబాద్ సర్వీస్ (ట్రైన్.నెంబర్ 07126) డిసెంబర్ 5,12,19,26, జనవరి 2,9న అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైన్ చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూర్ లాంటి ప్రధాన స్టేషన్ల అన్నింటిల్లోనూ ఆగనుంది.డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. ప్రైవేట్ బస్సులతో పాటు ట్రైన్లలో ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఈ రెండు నెలల్లో శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపనుంది. రెండు నెలల పాటు ఈ ప్రత్యేక ట్రైన్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ట్రైన్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.

 

Tags: Good news for devotees going to Sabarimala

Post Midle