శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులు, ఇతర పనుల నిమిత్తం తిరుపతి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి మీదుగా నడిచే మరో 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది ఏపి క్రైమ్ న్యూస్ శివ శంకర్.చ లు వా ది అందుబాటులోకి రానున్న ప్రత్యేక రైళ్లు ఇవే.. హైదరాబాద్‌– తిరుపతి (07510) రైలు ఈ నెల 27 నుంచి సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు ప్రతి శనివారం. తిరుపతి–హైదరాబాద్‌ (07510) రైలు ఈ నెల 28 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు ప్రతి ఆదివారం. హైదరాబాద్‌– తిరుపతి (07643) రైలు సెప్టెంబర్‌ 5 నుంచి 26వ తేదీ వరకు ప్రతి సోమవారం. తిరుపతి– హైదరాబాద్‌ (07644) రైలు సెప్టెంబర్‌ 6 నుంచి 27 వరకు ప్రతి మంగళవారం. తిరుపతి– ఔరంగాబాద్‌ (07637) రైలు ఈ నెల 28వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 25 వరకు ప్రతి ఆదివారం. ఔరంగాబాద్‌– తిరుపతి (07638) రైలు ఈనెల 29 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు ప్రతి సోమవారం. తిరుపతి– హుజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌ (07642) రైలు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 27 వరకు ప్రతి మంగళవారం. తిరుపతి– హుజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌ (07640) రైలు సెప్టెంబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు ప్రతి శనివారం. హుజూర్‌ సాహిబ్‌ నాందేడ్‌– తిరుపతి (07639) రైలు సెప్టెంబర్‌ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం. తిరుపతి– కాచిగూడ (07614) రైలు సెప్టెంబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 2 వరకు ప్రతి బుధవారం ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

 

Tags: Good news for the devotees of Lord Srivenkateswara Railway Department

Leave A Reply

Your email address will not be published.