ఎండోమెంట్ శాఖలోని అర్చక సోదరులకు శుభ వార్త…!!

విజయవాడ ముచ్చట్లు:

 

ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ను అమలు చేయాలని తేదీ. 05.05.2022 న గౌ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి తీర్పు అమలు చేసే నిమిత్తం ఆం.ప్ర. దేవాదాయ,ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీ హరిజవాహర్ లాల్ 5 లక్షల రూ/- సంవత్సర ఆదాయం కల ఆలయాల నుండి EAF/CGF/AWF/ AUDIT FEE బకాయిలుతో సహా వసూళ్లను నిలుపుదల చేయాలని జిల్లా DEO / జోనల్ DC/RJC లకు ఉత్తర్వులు జారీచేశారు…!! దీనివలన దేవాలయం లోని స్వామి వారికి నిత్య దూప,దీప నైవేద్యాలకు మరియు అర్చకుల జీతాలకు మొదట ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.ఈ తీర్పును క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో స్థానిక అధికారులు,అర్చకులదే బాధ్యత…!!!కోర్టు తీర్పు అమలు చేయని దేవాలయాల అర్చకులు స్థానిక అర్చక సంఘ నాయకుల దృష్టికి మీ సమస్యను తెలియజేసి తక్షణమే పరిష్కరించుకోగలరు.

 

 

Tags:Good news for the priestly brothers in the endowment department … !!

Post Midle
Post Midle
Natyam ad