Distribution of masks to everyone in the state

ఏపి జగన్ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.

Date:04/04/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

* ప్రధాని మోదీని… ఏపీ సీఎం అడిగిన వెంటనే!*

# 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద
రూ.5,987 కోట్లను సిఫార్సు చేయగా.. ఏప్రిల్‌ నెలకు
రూ.491.41 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి అడ్వాన్స్‌గా
రూ.559.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.

# కరోనా కష్టకాలంలో ఏపి జగన్ సర్కార్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద.. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్‌ కింద
రూ.1,050.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది.

# ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెలకు ఈ నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

# 2020–21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లను సిఫార్సు చేయగా.. ఏప్రిల్‌ నెలకు
రూ.491.41 కోట్లు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం ఏప్రిల్‌ నెలకు
రూ.6,157.74 కోట్లు, అన్ని రాష్ట్రాలకు విపత్తుల సహాయ నిధి కింద అడ్వాన్స్‌గా తొలి విడతగా రూ.11,092 కోట్లను విడుదల చేసింది.

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు

Tags: Good News is central to AP Jagan Sarkar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *