ఓటరు నమోదుకు మంచి స్పందన

Good response to voter registration

Good response to voter registration

 Date:18/09/2018
సికింద్రాబాద్ ముచ్చట్లు:
ఓటరు నమోదు కోసం జిహెచ్ఎంసి ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ కు మంచి స్పందన వస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని జి.హెచ్.ఎం.సి కమీషనర్ దానకిషోర్ కోరారు.సికింద్రాబాద్ లోని కస్తూరిబా కళాశాలలో ఓటర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.యువత.స్త్రీల నిష్పత్తి తక్కువగా ఉందని 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని చెప్పారు.
సవరణలున్నా మార్పులు చేర్పులున్నా ఈ నెల 25 వరకు క్యాంపెయిన్ లేదా ఇంటి వద్దకు వచ్చే బూత్ లేవల్ ఆఫీసర్ కు సమాచారమందించాలన్నారు.అన్ని రాజకీయ పార్టీలు ఓటరు నమోదుకు ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్యంగా అర్హులైన విద్యార్థులు ఓటు నమోదు చేసుకోవాలన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు చాలా విలువైనది ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags:Good response to voter registration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *