Good water arrangements for the RTC depot

ఆర్టీసీ డిపోకు మంచి నీటి ఏర్పాట్లు

Date:10/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్టీసి డిపో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు వేగంవంతం చేశారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు డిపోలో మంచినీటి సౌకర్యం కోసం నూతన బోరును ప్రారంభించారు. ఆర్టీసి మజ్ధూర్‌శాఖ అధ్యక్షుడు జయరామిరెడ్డి ఆధ్వర్యంలో బోరు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జయరామిరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు డిపో పనులు దాదాపుగా పూర్తిగా కావస్తోందన్నారు. త్వరలోనే పుంగనూరు ప్రజలకు డిపో ద్వారా ఆర్టీసి సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వెంకటరెడ్డి యాదవ్‌, నాగరాజారెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, ఆర్టీసి నాయకులు కరీముల్లా, సీఎం.బాషా తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాలో 27 మంది ఐఏఎస్‌ ఆఫీసర్ల బదిలీ

Tags: Good water arrangements for the RTC depot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *