యువరాజ్ క్రికెట్ కు గుడ్ బై

Goodbye to Yuvraj Cricket

Goodbye to Yuvraj Cricket

Date:10/06/2019

ముంబై ముచ్చట్లు:

ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫామ్‌ కోల్పోవడంతో రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న యువీ తన క్రికెట్ కెరీర్‌ ముగిస్తున్నట్లు సోమవారం ముంబయిలో ప్రకటించాడు. టీమిండియాలో ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో కెన్యాతో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రంగ ప్రవేశం చేశాడు. చివరగా 2017లో వెస్టిండీస్‌తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. యువీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరదించుతూ తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు యువరాజ్ ప్రకటించాడు. యువరాజ్ తన కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 14 వన్డేలు, 52 హాఫ్ సెంచరీలతో 8,701 పరుగులు, టీ20ల్లో 8 అర్ధసెంచరీలతో 1177 పరుగులు, టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు. మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో(2007 టీ20, 2011 వన్డే) యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.

 

 

 

 

 

 

 

2011 వన్డే ప్రపంచకప్‌లో అటు బ్యాట్, ఇటు బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి టీమిండియా కప్పు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 9మ్యాచ్‌ల్లో 362(ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు)పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అనంతరం కేన్సర్ మహమ్మారి బారిన పడిన యువీ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాడు. ప్రాణాంతక వ్యాధితో పోరాడి మళ్లీ బ్యాట్ పట్టిన యువరాజ్ గతంలో మాదిరిగా రాణించలేకపోయాడు. ఫామ్ కోల్పోవడం, యువ ఆటగాళ్ల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో జట్టులో స్థానం కోల్పోయాడు. వయస్సు కూడా పెరగడంతో సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టేశారు. అతడు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి రెండేళ్లు దాటింది.కెట్ కోసం తన రక్తం, స్వేదం ధార పోశానని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో యూవీ మాట్లాడుతూ, ఇన్నేళ్లు తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, సహచరులకు, మిత్రులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తన జీవితంలో తనపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదని, క్రికెట్ తనకు ఆడడం, పోరాడటం, పడటం, లేవటం, ముందుకు సాగడం నేర్పిందని చెప్పారు. ఇకపై కేన్సర్ బాధితులకు అండగా ఉండటమే తన తదుపరి లక్ష్యమని అన్నారు. కాగా, 2011 ప్రపంచ కప్ సమయంలో యూవీ కేన్సర్ బారిన పడ్డాడు. ఈ ప్రపంచకప్ అనంతరం కేన్సర్ చికిత్స తీసుకున్నాడు. కేన్సర్ నుంచి కోలుకున్నాక యూవీ ఆటలో వెనుకబడిపోయాడు.

నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ పై ఫిర్యాదు

Tags:Goodbye to Yuvraj Cricket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *