మే 26న గోనె సంచులు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి ముచ్చట్లు:

టిటిడిలో పోగయిన వినియోగించిన గోనె సంచుల‌ను మే 26న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. ఆస‌క్తి గ‌ల‌వారు రూ.40 వేలు డిడి తీసి ఇఎండిగా చెల్లించాలి. సీల్డ్ టెండ‌ర్ల‌ను మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

 

Tags:Goon bags tender auction on May 26