గోపి యాదవ్ మృతి పార్టీకి తీరని లోటు – మంత్రి పెద్ది రెడ్డి!
-గోపి యాదవ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన
-మంత్రి పెద్దిరెడ్డి, బీరేంద్ర వర్మ
బుచ్చినాయుడు కండ్రిగ ముచ్చట్లు:

గోపి యాదవ్ లాంటి బిసి యువ నాయకుడిని కోల్పోవడం బుచ్చినాయుడు కండ్రిగ వైసీపీలో తీరని లోటును నింపిందని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు, బుధవారం అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడు బీరెంద్ర రాజుతో కలిసి బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని గోపి యాదవ్ స్వగృహానికి చేరుకుని గోపీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం కుటుంబం సభ్యులను పరామర్శించారు, ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా గోపీ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు , ఎప్పుడు చలాకీగా ఉంటూ వైసిపి పార్టీని విజేతరాలకు చేర్చడంలో సంక్షేమ పథకాలను స్థానికులకు అందించడంలో తలమునకులై ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులను కలుస్తూ వైసిపి క్రియాశీలక రాజకీయాల్లో ముందుండే బీసీ నాయకుడిని కోల్పోవడం మనసుని కలిచివేస్తుందని ఇలా చిన్న వయసులో గుండెపోటుతో గోపీ మృతి చెందడం ఎంతో బాధగా ఉందని ఆ దేవదేవుడు ఆ కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు, నివాళులర్పించిన వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , తదితర ప్రజా ప్రతినిధులు వైసీపీ శ్రేణులు ప్రజలు తదితరులు ఉన్నారు…!
Tags; Gopi Yadav’s death is a huge loss for the party – Minister Peddi Reddy!
