గోపీచంద్‌, సంపత్‌నంది కాంబినేషన్లో భారీ చిత్రం

Gopichand, Sampathnandi Combination is a huge film

Gopichand, Sampathnandi Combination is a huge film

Date:14/12/2019

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  ప్రొడక్షన్‌ నెం.3  గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుండి ప్రారంభం అయింది. హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా  భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా…
శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ అధినేత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ – ” మా బేనర్ లో గోపీచంద్‌ సంపత్‌ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ గా  అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. గోపిచంద్ కెరీర్ లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం.  మా బేనర్ కి  మరోప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. గోపి చంద్ సరసన తమన్నా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మొదటి షెడ్యూల్   అనంతరం కంటిన్యూ గా  రాజమండ్రి, ఢిల్లీ షెడ్యూల్స్ పూర్తి చేసి ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు. మ్యాచో స్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి   డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

 

సచివాలయ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ

 

Tags:Gopichand, Sampathnandi Combination is a huge film

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *