Natyam ad

సైలెంట్ గా మారిపోయిన గోరంట్ల

అనంతపురం ముచ్చట్లు:


గోరంట్ల మాధవ్.. గతంలో ఈ పేరు చెబితే ఒక వైబ్రేషన్ ఉండేది. కానీ ఇప్పుడు… పేలని టపాసులా సైలెంట్ గా కనిపిస్తున్నారాయన. పోలీసు అధికారిగా ఉన్నప్పుడు నిత్యం వివాదాలతోనే సావాసం చేసేవారు. ఎంపీ అయ్యాక కూడా ఆయన స్టైల్ ఏ మాత్రం మారలేదు. నిత్యం ఏదో ఒక స్టేట్ మెంట్ తో వార్తల్లో నిలిచేవారు. కార్యక్రమం ఏదైనా అటెన్షన్ మాత్రం తన వైపే ఉండేలా చూసుకునేవారాయన. ఎక్కడైనా స్పేస్ లేకపోతే తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ… ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచేవారు ఎంపీ. వివాదాలు పెరుగుతున్నా… తగ్గేదే లే అన్నట్టుగా ముందుకు వెళ్ళారు. అయితే … సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఆ ఘటన.. ఆ ఒకే ఒక్క వీడియో వివాదం మాధవ్ పొలిటికల్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసిందట. ఇంకా చెప్పాలంటే… ఆ వివాదాస్పద వీడియో.. ఎంపీ జీవితంలోనే చెరగిన మచ్చగా మిగిలిపోయింది. ఎంత కాదన్నా.. ఆ వీడియోలో ఉన్నది నేనుకాదు, మార్ఫింగ్‌ అని ఎన్ని కబుర్లు చెప్పినా… జనం మాత్రం నమ్మలేదు.వీడియో వ్యవహారం తర్వాత మరో వివాదంలో చిక్కుకున్నారు మాధవ్‌. అనంతపురం సిటీలోని 80 ఫీట్ రోడ్డులో మూడేళ్లుగా ఉంటున్నారాయన. అయితే ఆ ఇంటి అద్దెకు సంబంధించిన విషయంపై పెద్ద గొడవే జరిగింది. ఎంపీ మూడేళ్ళ నుంచి తనకు రెంట్‌ ఇవ్వడం లేదని,

 

 

 

అలాగే కరెంట్‌ బిల్లు కూడా కట్టడం లేదని ఎంపీతో గొడవపడ్డారు ఇంటి ఓనర్‌. ఈ వ్యవహారంలో కొందరు పోలీస్ అధికారులు మధ్యవర్తం చేసి రాజీ కుదిర్చారట. ఇది కూడా అప్పట్లో పెద్ద న్యూస్ గా మారింది. ఇక టైం బ్యాడ్‌ అనుకున్నారో… లేక పొలీస్‌ ఆఫీసర్‌ డ్యూటీకి, పొలిటీషియన్‌ పాత్రకు తేడా ఉంటుందని జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయోగానీ…అద్దె విషయం సెటిల్ చేసిన తర్వాత పూర్తిగా సైలెంటైపోయారాయన. ఎక్కడైనా ప్రోగ్రాం జరిగితే వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే ఉంది ప్రస్తుతం వ్యవహారం. వరస వివాదాలు వెంటాడుతున్న క్రమంలో ఆయన ఏకంగా వాట్సాప్ వాడటం కూడా మానేసినట్టు చెబుతున్నారు సన్నిహితులు. ముఖ్యమైన విషయాలను కూడా ఫోన్లో అస్సలు మాట్లాడటం లేదట. ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడాలంటే నేరుగా వచ్చి పొమ్మంటున్నారట.

 

 

 

Post Midle

స్మార్ట్ ఫోన్ యుగంలో ఒక ఎంపీ వాట్సాప్ వాడటం లేదంటే నమ్మశక్యంగా లేకున్నా…వరుస వివాదాల క్రమంలో ఆయన వాట్సాప్ ను పూర్తిగా పక్కన పెట్టేసారన్నదే సన్నిహితుల మాట.మరోవైపు ప్రస్తుతం మాధవ్ అడుగులు ఎటువైపు అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఈయన విషయంలో అధిష్టానం మనసులో ఏముందన్నది కూడా అంతు చిక్కడం లేదట. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో ఎంపీలు కాస్తా ఎమ్మెల్యే లుగా బరిలోకి దిగుతున్నారని అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా కనిపించిన.. గోరంట్ల మాధవ్ ఇప్పుడు మౌనంగా ఉండటం, అదీ స్మార్ట్‌ ఫోన్‌ వాడటం లేదనడం ఆశ్చర్యంగా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు.

 

Tags; Gorantla became silent

Post Midle