ఆకట్టుకుంటున్న గొరిల్లా టీజర్ 

Gorgeous gorilla teaser

Gorgeous gorilla teaser

Date:18/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అర్జున్ రెడ్డి సినిమాలో చక్కని అభినయంతో ఆకట్టుకున్న ముద్దుల భామ షాలినీ పాండే తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా అవకాశాలు కొట్టేస్తోంది. తమిళంలో ఆమె నటించిన ‘100% కాదల్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా, దీనితోపాటు ‘గొరిల్లా’ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చింపాజీ కీలక పాత్రలో తెరకెక్కుతున్న ‘గొరిల్లా’లో జీవాకు జంటగా షాలినీ పాండే నటిస్తోంది. ఇందులో చింపాజీతో కొన్ని సన్నివేశాల్లో ఆమె నటించాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా షాలినీ మాట్లాడుతూ.. ‘‘చింపాజీని చూడగానే ముందుగా ఎంతో భయం వేసింది. అయితే, అది ఎంతో ఫ్రెండ్లీగా ఉండటంతో చాలా కొద్ది రోజుల్లోనే అది ఫ్రెండైపోయింది’’ అని తెలిపింది. ఈ సినిమా కోసం థాయ్‌లాండ్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన చింపాజీని తీసుకొచ్చారని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రమని తెలుస్తోంది. డాన్ సాండీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యోగి బాబు, స‌తీష్ కీల‌క పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి.
Tags:Gorgeous gorilla teaser

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *