ఎదురించి పెళ్లి చేసుకున్నారు…

-ఆత్మహత్య చేసుకున్నారు…
Date:16/041/2018
నిజామాబాద్  ముచ్చట్లు:
 ప్రేమించిన వ్యక్తి కోసం పెద్దవాళ్లను ఎదురించింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని.. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కాని తన ఆశలన్నీ.. అడియాసలవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఇష్టపడి కట్టుకున్న వాడే కష్టపెట్టడంతో నాలుగు నెలలకే… ఇక ఈ జీవితం చాలంటూ బలవన్మరణం పొందింది. నిజామాబాద్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌‌‌లోని హమాల్‌వాడి ప్రాంతానికి చెందిన ప్రవళిక ఫార్మసీ విద్య చదివింది. కళాశాలలో చదువుతున్న సమయంలో కామారెడ్డికి చెందిన ప్రేమ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి పెళ్లికి పెద్దలు వ్యతిరేకించారు. అయితే వారిని ఎదురించి నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహమైన కొద్దిరోజులు ఇద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత అసలు కథ మొదలైంది. ప్రేమ్ తరచూ ప్రవళికను మాటలతో తీవ్రంగా వేధించేవాడు. కనికరం లేకుండా ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ప్రవళిక  నిద్రమాత్రలు మింగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె భర్త ప్రేమ్‌ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం  మృతి చెందింది. భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని… తట్టుకోలేకపోతున్నట్లు… తల్లికి ఫోన్‌లో చెప్పేదని కుటుంబీకులు చెప్పారు. ప్రవళిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు… భర్త వేధింపుల వల్లే చనిపోయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Got married and married …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *