Governance in villages through secretaries

సచివాలయాల ద్వారా గ్రామాల్లో సుపరిపాలన

– అక్కిసాని భాస్కర్‌రె డ్డి

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామ సచివాలయ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించేందుకే సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని వెహోదుగులపల్లె గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మిస్తున్న నూతన సచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజా కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్‌ హాజరై , పూజలు చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టినట్లు తెలిపారు. మండలంలో 21 సచివాలయాలలో 17 సచివాలయాలకు పక్కా భవనాలను నిర్మించేందుకు ఒకొక్క భవనానికి రూ.40 లక్షలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రతి సచివాలయంలోను అన్ని వసతులతో గోడౌన్లను కూడ నిర్మిస్తున్నట్లు తెలిపారు. 17 సచివాలయ పనులు త్వరలోనే పూర్తి చేసి, పక్కా భవనాలలో సచివాలయ పాలన పక్కా భవనాలలో కొనసాగిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను సచివాలయాలలోనే పరిష్కరించుకునేలా అవగాహన పెంచుకోవాలన్నారు. మండల కార్యాలయాలకు ప్రజలు వచ్చి అధిక వ్యయం చేసుకోవద్దని సూచించారు. సచివాలయాలలో సమస్యలు పరిష్కారం కాకపోతే అప్పుడు మండల కార్యాలయాలకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు మురుగుప్ప, పాపిరెడ్డి, జనార్ధన్‌, సచివాలయ ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

Tags: Governance in villages through secretaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *