Natyam ad

శ్రీకాళహస్తిలో పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల ప్రమాణస్వీకారం

చిత్తూరు ముచ్చట్లు:


శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల ప్రమాణ స్వీకార మహోత్సవం.నేడు అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి దేవస్థానం భరద్వాజతీర్థంలోని గంగసదన్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగాపాల్గొని,దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు,అనంతరందేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు మాట్లాడుతూ  తమకు శ్రీకాళహస్తి ఈశ్వరునికి సేవచేసే భాగ్యంకలిగించిన శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే  సూచన మేరకు ఆలయ అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.

 

 

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ  నూతనంగా నియమితమైన దేవస్థాన పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల అభినందనలు తెలియజేసి, ప్రతి ఒక్కరూ దైవ సేవతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిగించే విధంగా, ఆలయని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్లాలని  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో సాగర్ బాబు, జూలుగంటి సుబ్బారావు, చింతామణి పాండు, ,పి. మదన్ మోహన్ రెడ్డి-TMV కండ్రిగ, కె.శోభ , పి.నీల, శ్రీదేవి, కె.మీనాక్షి, బి.పవన్ కుమార్, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Governing body swearing in special invitees at Srikalahasti

Post Midle

Leave A Reply

Your email address will not be published.