మేక్ మై ట్రిప్తో అవఘాహన ఒప్పందం  ఆమోదించిన పర్యాటక అభివృద్ది శాఖ పాలక మండలి

Date:13/07/2018
 అమరావతి  ముచ్చట్లు:
ప‌ర్యాట‌క అతిధి గృహాల‌లో ఆక్యుపెన్సీ స్ధాయిని పెంచే క్ర‌మంలో మేక్‌మై ట్రిప్ సంస్ధ‌తో ఒప్పందం చేసుకోవాల‌ని ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ నిర్ణ‌యించింది. శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ 177వ పాల‌క మండ‌లి స‌మావేశం సంస్ధ ఛైర్మ‌న్  ఆచార్య జ‌య‌రామి రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో జ‌రిగింది. త‌క్కువ ఆక్యుపెన్సీ ఉన్న అతిధి గృహాల‌కు సంబంధించి మాత్ర‌మే ఈ ఒప్పందంఅమ‌ల‌వుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ నిర్వ‌హ‌ణా సంచాల‌కులు హిమాన్హు శుక్లా  స‌మావేశం దృష్టికి తీసుకురాగా పాల‌క మండ‌లి అంగీకారం తెలిపింది. మాన‌వ వ‌న‌రుల ప‌రంగా ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ‌లో ఉన్న వ్య‌వ‌స్ధ‌ను ఒక దారిలో పెట్టేందుకు స్ప‌ష్ట‌మైన్ హెచ్ఆర్ పాల‌సీని తీసుకు రావ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త‌ను ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా పాల‌క మండ‌లికి వివ‌రించారు. ఇందు కోసం ఒక ఏజెన్సీని నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. మంచి పనితీరు ప్రదర్శించే ఉద్యోగులకు  ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కూడా పాలకమండలి అంగీకారంతెలిపింది.యూనిట్ మేనేజర్తో పాటు మరో ఉద్యోగికి ప్రతి మూడు నెలలకు ఒకసారి అదాయం పెంపు ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలుఇవ్వనున్నారు. సమాజంలో వంటవారికి ఉన్న డిమాండ్, కొరతను దృష్టిలో ఉంచుకుని వారి వేతనాలను రూ.17,500 నుండి 21,500లకు,రూ.15,000 నుండి 18,000లకు పెంచేందుకు అంగీకరించారు. మరోవైపు ఒక మాస్టర్ ఛెప్ను ఒక సంవత్సర కాలానికి నియామకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక అతిధి గృహాల లోని వంటవారికి శిక్షణ అందించాలని నిర్ణయించారు. అంతర్వేదిలో పర్యాటక సంస్ధ అధీనంలో ఉన్నఅతిధి గృహాన్ని లీజు ప్రాతిపదికన దేవాదాయ శాఖకు ఇచ్చే అంశంపై బోర్డు లోతుగా చర్చించింది. సమావేశంలో పాలకమండలి సభ్యులు వి.రాము,పి. సింహాచలం నాయిడు, సి.బాబూ రమేష్, ఎం.బ్రహ్మయ్య, వీర శంకర రెడ్డి, సంస్ధ ఇడి టివిఎస్జి కుమార్, జిఎం డాక్టర్  బి.విశ్వనాధం, హరినాధ్,కంపెనీ సెక్రటరీ టి.సుబ్బారావు పాల్గొన్నారు.
 మేక్ మై ట్రిప్తో అవఘాహన ఒప్పందం  ఆమోదించిన పర్యాటక అభివృద్ది శాఖ పాలక మండలి https://www.telugumuchatlu.com/governing-council-of-tourism-development-department-approved-by-the-transmission-agreement-with-make-my-trip/
Tags:Governing Council of Tourism Development Department approved by the Transmission Agreement with Make My Trip

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *