నిజమైన పాత్రికేయులకు ప్రభుత్వ సహాయ సహకారం ఎప్పుడూ ఉంటుంది

– ప్రెస్ అకాడమీ చైర్మన్ దేరెడ్డి శ్రీనాథ్

Date:30/10/2020

నంద్యాల  ముచ్చట్లు:

నిజమైన పాత్రికేయులకు ప్రభుత్వ సహాయ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ దే రెడ్డి శ్రీనాథ్ అన్నారు.శుక్రవారం రోజు నంద్యాల నుండి కడప కు బయలుదేరుతున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ దే రెడ్డి శ్రీనాథ్ కు నంద్యాల తహసిల్దార్ రవికుమార్ నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి తాలూకా  సి ఐ దివాకర్ రెడ్డి వీడ్కోలు పలికారు.ప్రెస్ అకాడమీ చైర్మన్ దేరెడ్డి శ్రీనాథ్ మాట్లాడుతూ మన ప్రభుత్వం పాత్రికేయులకు సహాయ సహకారాలు అందించుతునధనరు ప్రెస్ అకాడమీ ద్వారా పాత్రికేయులకు ఆన్లైన్లో సంపూర్ణ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నదని పాత్రికేయులు కేవలం శిక్షణకు పరిమితం కాకుండా అకాడమీ ఎదుగుదలకు కూడా తోడ్పడాలని .జర్నలిజం చేయదలచుకున్న వారికి అకాడమీ చేయూతను అందించు తుందన్నారు గ్రామీణ పట్టణ పాత్రికేయుల సమస్యలు ఎదురైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామన్నారు సోషల్ మీడియా వరు వడిలో పడకుండా ప్రజలకు నిజ నిజాలను తెలియజేయడం కొరకు పాత్రికేయులు కృషి చేయాలన్నారు ప్రింట్ మీడియా తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారని అన్నారు కరోనా బారినపడి మృతి చెందిన పాత్రికేయులకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం  అందించుతున్నఅన్నారు పాత్రికేయులకు సంపూర్ణ సమగ్ర శిక్షణ ఇచ్చి మెరుగైన పాత్రికేయులుగా తీర్చిదిద్దడమే ప్రెస్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. గ్రామీణ ప్రాంత పాత్రికేయులకు 26 అంశాలతో  జర్నలిస్టులకు అనుభవం కలిగిన ఆనుభవము గల వారి చేత శిక్షణ ఇపించు ద్దామన్నారు అదే విధంగా ప్రెస్ అకాడమి వారు ప్రారంభించే వెబ్సైట్ట్ కూడా గ్రామీణ ప్రాంత  పాత్రికేయుల కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఇద్దరు పిల్లలు, తల్లి అదృశ్యం

Tags: Government assistance to real journalists is always there

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *