ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొట్కూరు హర్ ఘర్ తిరంగా ర్యాలీ..
నందికొట్కూరు ముచ్చట్లు:
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొట్కూరు లో 75వ స్వాతంత్ర మహోత్సవ కార్యక్రమాల సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సునీత గారి ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంట త్రివర్ణ పతాకం అనే నినాదాలతో నందికొట్కూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు . ఈ ర్యాలీలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సునీత గారి ఆధ్వర్యంలో వారితో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాను చేతిలో పట్టుకొని మేరా భారత్ మహాన్ హర్ ఘర్ తిరంగా వర్ధిల్లాలిభారతదేశం వర్ధిల్లాలి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పడానికి, భారత దేశ ప్రగతిని చాటి చెప్పడానికి , దేశ ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని తెలియజేసే మన త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుని గుండెల్లో దేశభక్తిని కలగజేయాలని, ప్రతి ఇంటిపై ఈ జెండా రెపరెపలాడాలని మన భారత ప్రధాని గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సునీత గారు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు భారీ ఎత్తున ర్యాలీ ర్యాలీలో పాల్గొన్నారు గత పది రోజుల నుండి ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంతో వ్యాసరచన పోటీ, వక్తృత్వ పోటీ పెయింటింగ్ పోటీ , దేశభక్తి గీతాలలో పోటీలు నిర్వహిస్తూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొట్కూరు ప్రతి దేశభక్తి కార్యక్రమంలో ముందుకు వెళుతూ అందరికీ ఆదర్శంగా నిలబడింది.

Tags: Government Degree College Nandi Kotkur Har Ghar Tiranga Rally..
