ప్రభుత్వం, మేఘా మధ్య డిస్కవర్రీ

హైదరాబాద్ ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై డిస్కవరీ డాక్యుమెంటరీ వివాదంగా మారుతోంది. ప్రముఖ ఇంగ్లిష్ఛానల్డిస్కవరీలో టెలికాస్ట్ చేసిన కాళేశ్వరం ప్రత్యేక డాక్యమెంటరీలో కేవలం నిర్మాణ సంస్థనే హైలెట్చేసినట్లు ఇరిగేషన్ఇంజినీర్లు మండిపడుతున్నారు. అసలు ఇంజినీర్లు, ప్రభుత్వం చేసిందంతా పక్కన పెట్టి కేవలం మెఘా నిర్మాణ సంస్థ కష్టంతోనే కాళేశ్వరం పూర్తి చేశారనే విధంగా కథనం వచ్చిందంటూ ఇరిగేషన్వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిస్కవరీలో కాళేశ్వరం డాక్యుమెంటరీని ముందుగా హైలెట్ చేసిన ప్రభుత్వం… నీటిపారుదల శాఖ ఆ తర్వాత తేలిగ్గా తీసిపారేస్తోంది. దాదాపు 55 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో అత్యధికంగా మెఘా ప్రాజెక్టు, సంస్థ ఇంజినీర్లు, సంస్థ ప్రతినిధులనే హైలెట్చేశారు. ప్రభుత్వం, ఇరిగేషన్ఇంజినీర్ల భాగస్వామ్యాన్ని తెరకెక్కించడంలో వెనకబడ్డారు. దీంతో ఇది కాళేశ్వరం డాక్యుమెంటరా… మెఘా సంస్థ సొంత వీడియోలా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.వాస్తవానికి డిస్కవరీలో కాళేశ్వరం ప్రత్యేక డాక్యుమెంటరీపై ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేసింది. ఆ డాక్యుమెంటరీని తిలకించాలంటూ ప్రకటనలు గుప్పించింది. కాళేశ్వరం ప్రగతి దేశ, విదేశాలకు పాకుతుందని, అంతర్జాతీయ వేదికపై కాళేశ్వరం ఆవిష్కృతమవుతుందంటూ నీటిపారుదల శాఖ ఈ కథనానికి ప్రచారం కల్పించింది. కానీ డిస్కవరీలో వచ్చిన పూర్తి కథనంలో నిర్మాణ సంస్థను హైలెట్ చేసినంతగా ప్రాజెక్టును చూపించలేదు.

 

 

 

 

దీనిలో ప్రభుత్వం, ఇంజినీర్లు చేసిన కృషిని తక్కువగానే చూపించారు.కేవలం నిర్మాణ సంస్థ కోసమే ఇదంతా చేశారనే కోణంలో తమ సంస్థను హైలెట్ చేసుకునే విధంగా కథనాన్ని చూపించడంలో మెఘా సంస్థ కీ రోల్ పోషించిందని, ఇంజినీర్ల కృషిని పక్కనపెట్టి తమ సంస్థనే హైలెట్ చేసుకుందనే విమర్శలు మొదలయ్యాయి. అంతేకాకుండా పనులపై నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో కాకుండా… ఎంత మేరకు పనులు చేశాం, ఎలా పనులు చేశామంటూ మెఘా ఇంజినీర్లతోనే చెప్పించారు. డాక్యుమెంటరీలో మెఘా ఇంజినీరింగ్సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డితో పాటు ఇతర స్థాయిల్లోని కంపెనీ ఇంజినీర్లతోనే కథనంలో మాట్లాడించారు. అంతేకానీ మొదట్లో ఒకసారి, చివర్లో ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సీఈతో మాట్లాడించారు.అంతేకాకుండా కాళేశ్వరం నిర్మాణంలో తమ సంస్థను హైలెట్ చేసుకునే క్రమంలో అటు ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలేదు. నిర్మాణ సంస్థ ఎండీ ఐదారు సార్లు మ్యాపులను పరిశీలిస్తూ, పలుమార్లు పనులను పరిశీలిస్తూ, కొన్ని సందర్భాల్లో తమ సిబ్బందికి సలహాలు ఇస్తూ కనిపించేలా చిత్రీకరించుకున్నారు. దీనిపై సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్శ్రీనివాస్రెడ్డితో పదేపదే మాట్లాడించారు. కానీ సీఎం కేసీఆర్, ఇంజినీర్లను కేవలం రెండు పర్యాయాలకే పరిమితం చేశారు.డిస్కవరీ ఛానల్ డాక్యమెంటరీని వీక్షించాలని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసిందో… టెలికాస్ట్ తర్వాత అంత సైలెంట్అయింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని, పనుల దగ్గర ఉన్న జల వనరుల శాఖ ఇంజినీర్లను కనీసం చూపించలేదు.

 

 

 

 

కేవలం నిర్మాణ సంస్థే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లుగా, ఇది పూర్తి చేయడం కేవలం మెఘా సంస్థ గొప్పతనమే అన్నట్లుగా చూపించుకున్నారు. అంతేకాకుండా మేఘా కంపెనీ ఈ పనులు ప్రారంభించినప్పటి నుంచి దీని మ్యాపులు, డిజైన్లను చేయడంలో మెఘా ప్రతినిధులే చేసినట్లుగా కల్పించారు. పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెఘా కంపెనీ చేసిన పూజలు, పనులు… ఇలా అన్నింటినీ పాత వీడియోలతో ఈ కథనం చూపించారు. దీంతో సీఎం కేసీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.ప్రభుత్వ గొప్పతనాన్ని కాదని కేవలం నిర్మాణ సంస్థను ఫోకస్ చేయడంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జల వనరుల శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లక్ష కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ప్రాజెక్టును ఒక నిర్మాణ సంస్థ తమ గొప్పతనంగా చూపించుకోవడం డాక్యుమెంటరీలో ప్రధానంగా నిలిచిందని టీఆర్ఎస్వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు ఇరిగేషన్ ఇంజినీర్లు కూడా సదరు నిర్మాణ సంస్థపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మెఘా కంపెనీ ఇంజినీర్లు, ఆ సంస్థే పని చేసినట్లుగా చూపించుకుని, తమను తక్కువ చేశారంటూ ఆగ్రహిస్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం డాక్యమెంటరీ ఇరిగేషన్లో వివాదంగా మారింది.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Government, Discovery between Megha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *