Natyam ad

పుంగనూరులో ఎలక్ట్రికల్‌ బస్సుల కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నిల్‌

– మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిల కృషి ఫలితం
-రూ. 4,640 కోట్లతో జర్మన్‌పెప్పర్‌ కంపెనీ నిర్మాణం
– 8 వేల మందికి ఉపాధి

 

పుంగనూరు ముచ్చట్లు:

 

Post Midle

పుంగనూరు నియోజకవర్గం పారిశ్రామికాభివృద్ధిలో పరుగులు తీస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ , లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లు కలసి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు పుంగనూరులో ఎలక్ట్రికల్‌ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రూ. 4,640 కోట్లతో జర్మన్‌పెప్పర్‌ కంపెనీ నిర్మాణం చేపట్టనున్నది. దీని ద్వారా 8 వేల మంది నేరుగా పరోక్షంగా నిరుద్యోగులకు, ప్రజలకు ఉపాధి లభించనున్నది.

ఏర్పాటు…

మండలంలోని ఆరడిగుంట, మేలుందొడ్డి గ్రామాల్లో ఇండస్ట్రీయల్‌ కారిడార్‌కు సుమారు రెండు వేల ఎకరాలను మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి కలసి కేటాయించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం జర్మన్‌ కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్‌ బస్సుల నిర్మాణ కంపెనీకి స్థలాన్ని కేటాయించనున్నారు. ఇప్పటికే పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలలోని పెద్దపంజాణి మండలంలో కూడ సుమారు రెండువేల ఎకరాలను పారిశ్రామిక కారిడార్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన ఫెరాఆలాయ్‌ స్టీల్‌ఫ్యాక్టరీకి పనులు జరగుతున్నాయి. అలాగే గ్యాస్‌ సిలిండర్ల ఫ్యాక్టరీకి స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్‌ బస్సు పరిశ్రమకు ఆమోదం లభించడంతో నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నది. దీని ద్వారా సుమారు మూడు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నది.

సరిహద్దుల్లో అభివృద్ధి…

పడమటి నియోజకవర్గమైన పుంగనూరు గత 30 సంవత్సరాలుగా కరువు కాటకాలతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డిలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. నాలుగన్నరేళ్లలో 30 ఏళ్ల అభివృద్ధిని చేపట్టారు. పరిశ్రమలు ఊసేలేని పుంగనూరులో పరిశ్రమల ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక , తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న పుంగనూరు అభివృద్ధి చెందడంతో వ్యాపారలావాదేవిలకు పుంగనూరు అనువైన కేంద్రంగా మారింది. ముఖ్యంగా నీటి సమస్య తీర్చేందుకు పుంగనూరులో ఆవులపల్లె, నేతిగుట్లపల్లె ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఈ విషయాలపై ఎంపీ మిధున్‌రెడ్డి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపడంతో పుంగనూరు అనువైన ప్రాంతంగా నిర్ణయించి , పారిశ్రామికవేత్తలు ముందుకురావడంతో నిరుద్యోగులకు వరమైంది.

నమ్మిన ప్రజలకు న్యాయం …

తమ కుటుంభానికి అండగా ఉన్న పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేసి, ప్రజలకు న్యాయం చేయడమే తమ లక్ష్యం. 30 సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే చేపట్టాం. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక నిధులు, పరిశ్రమలు కేటాయించడంతో పుంగనూరుకు గుర్తింపు లభించింది. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను శక్తి వంచన లేకుండ పూర్తి చేస్తాం .

– రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

నిరుద్యోగులను ఆదుకుంటాం…

నిరుద్యోగులకు మాయమాటలు చెప్పకుండ పనులు చేసి పెట్టడమే మా ఆశయం. ముఖ్యమంత్రి జగనన్న ఆశీర్వాదంతో సరిహద్దుల్లో ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు , గండికోట నుంచి పైపులైన్లు ద్వారా నీటి సమస్య పరిష్కరిస్తున్నాం. పరిశ్రమలకు అవసరమైన నీరు పుష్కలంగా లభిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు పుంగనూరుకు రావడం అభినందనీయం. ప్రజలకు, నిరుద్యోగులకు ఉపాధి లభించే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేశాం.

– పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, ఎంపీ , రాజంపేట.

 

Tags: Government gives green signal to set up electric buses company in Punganur

 

Post Midle